Gnanavel Raja About Kanguva 2: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. దర్శకుడు శివ తెరకెక్కించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ నవంబర్ 14న అట్టహాసంగా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 11 వేలకు పైగా స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సినిమాకు వస్తున్న టాక్ తో పాటు ‘కంగువ 2’ గురించి కీలక విషయాలు వెల్లడించారు.
‘కంగువ’ నెగెటివ్ టాక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
‘కంగువ’ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ లో తొలి 20 నిమిషాలకు సంబంధించి కాస్త ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయన్నారు జ్ఞానవేల్ రాజా. ఆ తర్వాత సినిమా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చిందన్నారు. “సినిమా ప్రారంభంలో 20 నిమిషాలు కాస్త స్లోగా ఉందనే టాక్ వినిపించింది. ఆ తర్వాత సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెప్తున్నారు. సూర్య గత చిత్రాలకు సంబంధించి ఫుల్ రన్ కలెక్షన్లను ఈ సినిమాక కేవలం 2-3 రోజుల్లోనే దాటేస్తుంది. ఈ సినిమా కమర్షియల్ ఫర్ఫార్మెన్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. పండుగలను టార్గెట్ చేసుకుని వచ్చిన సినిమా కాదు కాబట్టి, తొలి రోజు కలెక్షన్లు అంచనాలకు కాస్త తక్కువగా వచ్చాయి. వీకెండ్ లో పుంజుకునే అవకాశం ఉంది” అన్నారు.
‘కంగువ’ సినిమాలో BGM లౌడ్ నెస్ మరి ఎక్కువగా ఉందనే విమర్శలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఎగ్జిబిటర్లతో మాట్లాడినట్లు చెప్పారు. లౌడ్‌నెస్ తగ్గించేందుకు రెండు పాయింట్ల వాల్యూమ్ తగ్గించాలని కోరామన్నారు. సౌండ్ మిక్సింగ్ వల్ల ఏర్పడిన సమస్య కారణంగా ఇబ్బంది కలిగిందన్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ విషయంలో తాము సంతోషంగా ఉన్నామని, ఆ లౌడ్ నెస్ మిక్సింగ్ ప్రాబ్లమ్ అని, ఆ విషయంలో రెండు పాయింట్లు తగ్గించమని చెప్పమని తెలిపారు.
కంటెంట్ గురించి కామన్ ఆడియన్స్ నుంచి ఎటువంటి ట్రోల్స్ రాలేదు. మొదటి షో తర్వాత యాంటీ ఫ్యాన్స్, వేర్వేరు కారణాల వల్ల కొంత మంది ట్రోల్ చేశారు. 'దేవర' సినిమాకూ ట్రోల్స్ వచ్చాయి. తమిళంలో 'గోట్'తో పాటు కొన్ని సినిమాలకూ ఇదే విధంగా ట్రోల్ చేశారు.
Also Read: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
‘కంగువ 2’ గురించి అదిరిపో అప్ డేట్
అటు ‘కంగువ 2’ గురించి నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర విషయాలు చెప్పారు. “దర్శకుడు శివ ప్రస్తుతం అజిత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే ‘కంగువ 2’ సినిమా చేస్తారు. పార్ట్ 2 చాలా వైల్డ్ గా ఉంటుంది. మొదటి పార్ట్ తో పోల్చితే అద్భుతంగా ఉంటుంది.
‘కంగువ’ సినిమా గురించి..
తమిళ నటుడు సూర్య హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా ‘కంగువ’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను సిరుత్తై శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఈ చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Also: భారీ మొత్తానికి ‘కంగువ‘ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న స్ట్రీమింగ్ దిగ్గజం, ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?