Kangana Ranaut Supports Raveena Tandon: సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌పై జరిగిన దాడి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబాయ్‌లో రవీనా కారుపై పలువురు దుండగులు దాడి చేశారు. ఆమె కారు వెళ్లి ఒక మహిళను ఢీ కొట్టిందని, అందుకే గొడవ మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. రవీనాపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో అంతటా వైరల్ అయ్యింది. అయినా కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ ఈ విషయంపై స్పందించడానికి ముందుకు రాలేదు. మొదటిసారి కంగనా రనౌత్.. ఈ విషయంపై స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ షేర్ చేసింది. కంగనా మాటలను చాలామంది నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.


చాలా భయంకరమైనది..


సినీ పరిశ్రమలో అయినా, రాజకీయాల్లో అయినా ఏదైనా పెద్ద విషయం జరిగితే దానిపై వెంటనే స్పందించడానికి ముందుంటుంది కంగనా రనౌత్. అలాగే రవీనా టాండన్‌పై జరిగిన దాడి విషయంలో కూడా ఎవరూ స్పందించకపోయినా.. తాను స్పందించడానికి ముందుకొచ్చింది. ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. ‘‘రవీనా టాండన్‌‌పై దాడి చాలా భయంకరమైనది. ఆమెపై దాడి చేసిన గుంపులో మరో 5, 6 మంది ఉండుంటే అక్కడే కొట్టి చంపేసేవారు. ఇలా రోడ్లపై జరిగే గొడవలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం’’ అని పేర్కొంది. అంతే కాకుండా వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.






కంగనాకు సపోర్ట్..


‘దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలకు పాల్పడినవారు తప్పించుకోవద్దు’ అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది కంగనా రనౌత్. చాలామంది నెటిజన్లు.. కంగనాకు సపోర్ట్‌గా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ విషయంపై స్పందించకుండా వదిలేస్తే మరికొందరికి కూడా ఇలాగే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ముంబాయ్ పోలీసులు సైతం ఈ ఘటనపై స్పందించారు. మహిళను రవీనా కారు ఢీ కొట్టడం వల్లే గొడవ మొదలయ్యిందని బాధితుడు ఆరోపించాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కారు.. ఆ మహిళ దగ్గర వరకు వెళ్లింది కానీ వారిని ఢీ కొట్టలేదని పోలీసులు చెప్తున్నారు.


కేసు లేదు..


బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన గురించి ఎఫ్‌ఐఆర్ ఫైల్ అవ్వకపోయినా పోలీస్ డైరీ మాత్రం దీని గురించి ఎంట్రీ జరిగింది. మహిళను ఢీ కొట్టారని ఆరోపించడంతో రవీనా టాండన్ కారు దిగింది. దీంతో వెంటనే తనను వెనక్కి నెట్టి కొట్టడం మొదలుపెట్టారు. వైరల్ అవుతున్న వీడియోలో రవీనా కారు దిగి ఆ మహిళను తిట్టడం మొదలుపెట్టిందని ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇక ఈ గొడవ తర్వాత రవీనాతో పాటు తనపై దాడి చేసినవారు కూడా ఖార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. కానీ ఇరువురు కేసు ఫైల్ చేయకుండానే స్టేట్‌మెంట్స్ ఇచ్చి వెళ్లిపోయారని తెలుస్తోంది.


Also Read: రవీనా టాండన్‌పై దాడి... కొట్టవద్దని వేడుకున్న కేజీఎఫ్ నటి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో