సినిమాలు, రాజకీయాలు మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఇప్పటిది కాదు. సినిమాల్లో నుంచి ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి వెళ్లారు. రాజకీయాలు వర్కవుట్ అవ్వని ఎంతోమంది నటీనటులు మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇలా అటు, ఇటు ఉంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నవారు కూడా ఉన్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అవ్వనుంది. తనే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం కంగనా పొలిటికల్ ఎంట్రీ గురించి బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ గురించి మాత్రమే కాదు.. ఎన్నికల విషయంపై కూడా కంగనా.. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


కన్ఫర్మ్ చేసిన కంగనా తండ్రి


కంగనా రనౌత్.. మొదటినుంచి తను బీజేపీ పార్టీకే సపోర్ట్ అని పలుమార్లు హింట్లు ఇచ్చింది. గత కొంతకాలంగా కంగనా.. బీజేపీలో జాయిన్ అవ్వనుందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి కారణం తను బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవడమే. ఆదివారం కులులో జేపీ నడ్డాతో సమావేశమయ్యింది కంగనా. దానికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే ఇప్పటికే రాజకీయాలపై ఆసక్తి ఉందని పలుమార్లు ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చిన కంగనా.. త్వరలోనే బీజీపీ తరపున పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతుందని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోనే తన తండ్రి అమర్‌దీప్ కూడా తాజాగా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. 


లోక్ సభ ఎన్నికల్లో


సినిమావారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ బాలీవుడ్‌లో ఇప్పటికీ జరుగుతున్న చాలావరకు కాంట్రవర్సీలకు కారణమయిన కంగనా లాంటి హీరోయిన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఏ రేంజ్‌లో కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దేనికి భయపడకుండా, బెదురులేకుండా సమాధానాలు ఇచ్చే కంగనా.. రాజకీయాల్లో కూడా ఇలాగే ఉంటుందా లేదా తన వైఖరిని మార్చుకుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా.. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా తను పాల్గోనుందని సమాచారం. అప్పటివరకు తన చేతిలో ఉన్న సినిమాలను కంగనా పూర్తి చేయగలుగుతుందా అని ఫ్యాన్స్‌లో సందేహం మొదలయ్యింది.


‘ఎమర్జెన్సీ’తో బిజీ


ప్రస్తుతం కంగనా రనౌత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ఎమర్జెన్సీ’. 1975 నుంచి 1977 మధ్యలో ఇండియాలో నిర్వహించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా రనౌత్.. ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. అచ్చం ఇందిరా గాంధీలాగా కనబడడంతో పాటు మాటతీరు, బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా కంగనా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే ‘ఎమర్జెన్సీ’ నుంచి విడుదలయిన టీజర్‌లో కంగనా.. ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇందులో కంగనా.. హీరోయిన్‌గా నటించడంతో పాటు దర్శకత్వం కూడా తానే వహించి, సినిమాను తానే ప్రొడ్యూస్ కూడా చేసింది. తను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న సమయంలోనే ఇలాంటి ఒక పొలిటికల్ డ్రామా మూవీ విడుదల కావడంతో ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయో చూడాలి.


Also Read: 'డంకీ' రివ్యూ: 'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్‌కు హ్యాట్రిక్ అవుతుందా? లేదా?