Kangana Ranaut Compares Her Self With Amitab Bachan: కంగనా రనౌత్.. ఈ బాలీవుడ్ యాక్టర్స్ ఇప్పుడు పొలిటీషియన్ అయ్యింది. ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే, ఇప్పుడు ఆమె గురించి ఆమె చెప్పుకున్న కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. కంగనా తనని తాను బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ తో పోల్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ కి అందరూ రెస్పెక్ట్ ఇస్తారని, తనను కూడా అందరూ అలానే చూస్తారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల ప్రచారంలో..
సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న ఈమె ఒక్కసారిగా పొలిటికల్ లీడర్ అవతారం ఎత్తారు. గతంలో చాలాసార్లు ఎంతోమంది మీద ఆమె కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమాల పరంగా, హిందుత్వం గురించి ఆమె ఎన్నోసార్లు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆమె. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కంగనా.
"దేశంలో మొత్తంలో రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, న్యూ ఢిల్లీ, మణిపూర్ ఎక్కడికి వెళ్లినా నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నా మీద విపరీతమైన ప్రేమ చూపిస్తారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదంతా. నేను ఒక విషయం అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అమితాబ్ బచ్చన్ తర్వాత ఎవరికైనా అంత ప్రేమ, అప్యాయతలు, రెస్పెక్ట్ లభిస్తుంది అంటే అది నాకు మాత్రమే" అని చెప్పారు కంగనా.
పొటిటికల్ గా బిజీ బిజీ..
టికెట్ ప్రకటించినప్పటి నుంచి చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు కంగనా. ఆమె పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పొలిటికల్ గా ఆమెపై ఎవరైనా కామెంట్స్ చేస్తే వాటిని ధీటుగా సమాధానం చెప్తున్నారు కంగనా. ఇటీవలే ఒక కాంగ్రెస్ నాయకుడు ఒకప్పుడు కంగనా రనౌత్ బీఫ్ తినేదని, ఇప్పుడు హిందువులకు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆమె తీవ్రంగా స్పందించారు. తను హిందూ వాదిని అంటూ వాళ్లకు ట్విట్టర్ ద్వారా సమాధానం చెప్పారు. భారత్ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు కంగనా రనౌత్.
జూన్ 14న ఎమర్జెన్సీ..
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు కంగనా రనౌత్. షూటింగ్స్ బ్రేక్ ఇచ్చిన ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాలో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా సినిమా తీశారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. దాంట్లో కంగనా రనౌత్ అచ్చం ఇందిరా గాంధీలాగానే ఉన్నారని విశ్లేషకులు కామెంట్ చేశారు. ఇక ఈ సినిమా పూర్తిగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: అలా చేస్తే తేడా అనుకుంటారేమో - అలాంటి వాళ్లకి స్వీట్ సినిమా ఇది: దర్శకుడు మారుతి