Director Nag Ashwin Interesting Comments on Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. జూన్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన ఫస్ట్ డే నుంచి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఏకంగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 680 పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేస్తుంది. దీంతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీసు రారాజు అనిపించుకుంటున్నాడు. కాగా 'బాహుబలి' తర్వాత ప్రభాస్ బాక్సాఫీసు రారాజుగా నిలుస్తున్నాడు.
తన ప్లాప్ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద రికార్డు క్రియేట్ చేశాయి. ఫలితంగా సంబంధం వసూళ్లు రాబడుతున్నాయి.మరోసారి ఇప్పుడు కల్కి 2898 ADతో రికార్డులు తిరగరాస్తూ మరోసారి బాక్సాఫీసు రారాజు అని నిరూపించాడు. కేవలం ఇండియా వైడ్‌గానే కాదు ఓవర్సిస్‌లోనూ కల్కి సత్తా చాటుతుంది. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమా ఓవర్సిస్ బాక్సాఫీసు వద్ద కల్కి రికార్డు సెట్ చేసుకుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇప్పటి వరకు 'కల్కి 2898 AD' 12.8 మిలియన్ల డాలర్ గ్రాస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికీ కలెక్షన్స్ పెంచుకుంటూనే పోతుంది.
ఈ యుగం బాక్సాఫీస్ స్టార్
ఇలా వరుసగా కల్కి బాక్సాఫీసు వద్ద ఆరు రోజులు రూ. 100 కోట్ల గ్రాస్ చేస్తూ సత్తా చాటుతుంది. ఇక కల్కి బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో మూవీ టీం, మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కల్కి సెట్‌లో కూల్‌గా కూర్చుని ఉన్న ప్రభాస్ ఫోటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "దీని అంతటికి కారణం ఇక్కడ కూల్‌గా కూర్చుని ఉన్న ఈ వ్యక్తే. నిష్పక్షపాతంగా ఈ యుగం బాక్సాఫీసు స్టార్ అతడు. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. మా ప్రొడక్షన్ ఏమైనా చేయగలదు అనే నమ్మకాన్ని ఇచ్చింది అతడే. ఎలాంటి ఇబ్బంది లేకుండ నా పని నేను చేసుకునేలా స్వేచ్ఛను ఇచ్చాడు.
ముఖ్యంగా అతడు ఇచ్చిన తెలివైన ఇన్‌పుట్స్ సినిమాకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడ్డాయి. మీ అందరి 'డార్లింగ్'.. మా భైరవ.. ఇప్పుడు ప్రపంచానికి K(కల్కి)" అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తుంది. కల్కి కోసం మూడు ప్రపంచాలను సృష్టించి విజువల్ వండర్ క్రియేట్ చేశాడు. ఇండియన్ మూవీ హిస్టరీలో ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా. సుమారు కల్కిని రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం.
Also Read: భర్తతో కలిసి ‘కల్కీ 2898 ఏడీ’ చూసిన దీపిక - రణవీర్ స్పందన ‘అత్యుత్తమం’