Kajal Aggarwal Final in Manchu Vishnu Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం 'కన్నప్ప'. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నార్త్ నుంచి సౌత్ వరకు పలువురు స్టార్స్ భాగం అవుతున్నారు. బాలీవుడ్ 'ఖిలాడి' అక్షయ్ కుమార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్, మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఇలా దాదాపు అగ్ర హీరోలంతా కన్నప్పలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో మూవీ ఓ భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ చిత్రం నుంచి వస్తున్న అప్‌డేట్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. భారీ తారగణం నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరనేది క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా పర్టిక్యూలర్ హీరోయిన్ పాత్ర అంటూ ఏం లేదని, కానీ పలువురు అగ్ర నటీమణులు కన్నప్పలో కీ రోల్ పోషిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇందులో పార్వతి పాత్రకు నయనతారను తీసుకుంటున్నట్టు మొదట ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత కొద్ది రోజులకు నాయనతార ఈ నటించడం లేదంటూ రూమర్ వచ్చింది.
ఆమె ప్లేస్‌లో కాజల్‌ను తీసుకుంటున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడీ ప్రచారం కాస్తా కార్యరూపం దాల్చింది. కన్నప్పలో కాజల్ ఫైనల్ అయిపోయింది. ఇందులో ఆమె ఓ కీలక పాత్ర పోషించనుంది. తాజాగా దీనిపై పీఆర్ఓ టీం నుంచి ఓ ప్రకటన కూడా వచ్చింది. "మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'లో కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా రాబోతుంది. సిద్ధంగా ఉండండి" అంటూ సురేష్ అనే పీఆర్ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ట్వీట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో టీజర్ లాంచ్
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఎక్కువ భాగాం న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కన్నప్పటికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాదలో జరుగుతోంది. పాన్ ఇండియా వస్తున్న కన్నప్ప టీజర్ లాంచ్‌ను మూవీ టీం గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మే 20న టీజర్‌ను లాంచ్ చేయబోతుంది మూవీ టీం. దీంతో కన్నప్ప మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే కన్నప్ప సెట్‌లో ప్రభాస్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల అక్షయ్ కుమార్ తన మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్‌గా ప్రభాస్ కన్నప్ప సెట్‌లో అడుగుపెట్టినట్టు మంచు విష్ణు అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రభాస్‌కి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఆసక్తిని పెంచింది మూవీ టీం.