Jurassic World Rebirth Review In Telugu: డైనోసార్ల కొత్త సినిమా వచ్చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు దీనిపై చాలా సందేహాలు నడిచాయి. ఈ సినిమాకు ముందు వచ్చిన 'జూరాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్ డమ్' (2018), 'జూరాసిక్ వరల్డ్: డొమినియన్' (2022)లు విమర్శల పాలయ్యాయి. దానితో ఆ సిరీస్ లో లేటెస్ట్ గా వచ్చిన మూవీ 'జూరాసిక్ వరల్డ్: రీబర్త్' పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. అయితే సినిమా ఎలా ఉంది? క్రొత్త డైనో సార్లు ఆకట్టుకున్నాయా? ఇప్పుడు చూద్దాం
'జూరాసిక్ వరల్డ్: రీబర్త్' కథ ఏమిటి?జూరాసిక్ వరల్డ్ (2015) ముందు కాలంలో ప్రారంభం అవుతుంది. పదిహేడేళ్ల క్రితం అంటే 2010 ప్రాంతంలో 'జూరాసిక్ పార్క్'ను సృష్టించిన ఇంజెన్ కార్పొరేషన్ కొన్ని హైబ్రీడ్ డైనోసార్లను సృష్టించే ప్రయత్నంలో భాగంగా T -రెక్స్ ను మరికొన్ని జాతులతో కలిపి భయంకరమైన ఆరు కాళ్ళ D-Rex డైనోసార్ ను తయారు చేస్తుంది. కానీ అది ల్యాబ్ నుండి తప్పించుకోవడంతో ఆ ఐలాండ్ ను వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. 'జూరాసిక్ పార్క్: డొమినియన్' (2022) ఈవెంట్స్ తరువాత డైనోసార్‌లు కొన్ని రిమోట్ ప్రాంతాలకు ఒంటరి ద్వీపాలకు చేరుకుంటాయి.
మానవుల్లో ఉండే కొన్ని వ్యాధులకు డైనోసార్‌లలోని DNAను ఉపయోగించి చికిత్స చేయవచ్చని ఒక ఫార్మాసూటికల్ కంపెనీ డైనోసార్ల రక్తపు శాంపిల్స్ కోసం ఒక టీమ్ ను డైనోసార్లు స్థిరపడిన ద్వీపానికి పంపుతుంది. ఆ టీమ్ కు నాయకురాలిగా జోరా (స్కార్లెట్ జోహాన్సన్ - Scarlett Johansson) వ్యవహారిస్తుంది. ఆ శాంపిల్స్ ను నీటిలో ఉండే మోసోసారస్ (Mosasaurus), భూమిపై సంచరించే టైటానో సారస్( Titanosaurus),గాలిలో ఎగిరే క్వెట్జా లోకాట్లాస్ (Quetzalcoatlus)ల నుండి సేకరించాల్సి ఉంటుంది. మరి ఈ మిషన్‌లో జోరా టీమ్ సక్సెస్ అయిందా? వాళ్లకి దారిలో కలిసిన రూబెన్ ఫ్యామిలీ ఎవరు? ప్రమాదకరమైన హైబ్రిడ్ డైనోసార్ D -rex నుండి ఎలా తప్పించుకున్నారు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు 'జూరాసిక్ వరల్డ్: రీ బర్త్' మూవీని థియేటర్లలో చూసి తెలుసుకోవాలి.
సినిమా ఎలా ఉంది అంటే?Jurassic World Rebirth Telugu Review: 1993లో జూరాసిక్ పార్క్ రిలీజ్ అయినప్పుడు అదో సంచలనం. దానికి సీక్వెల్ గా వచ్చిన 1998లో 'జూరాసిక్ పార్క్: ది లాస్ట్ వరల్డ్' కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలకూ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ దర్శకత్వం వహించారు. కానీ 2001లో వచ్చిన జూరాసిక్ పార్క్ 3 ఫెయిల్ అయింది. దీనికి కారణం ఆ సినిమాకు వేరే దర్శకుడు కావడమే అన్న విమర్శలు బాగా వినిపించాయి. ఆ తరువాత బాగా గ్యాప్ తీసుకుని 2015లో 'జూరాసిక్ వరల్డ్' అనే కొత్త సిరీస్ మొదలు పెట్టింది నిర్మాణ సంస్థ. ఆ సినిమా బాగా ఆడింది. అయితే వెంటనే వచ్చిన రెండు సీక్వెల్స్ ఫాలెన్ కింగ్ డ మ్, డొమినియన్ లు డబ్బులు బానే తెచ్చినా కథ పరంగా విమర్శల పాలయ్యాయి. ఇక ఆల్మోస్ట్ ఫ్రాంచైజీ ఆగిపోతోంది అనుకున్న సమయం లో చివరి ప్రయత్నం గా జూరాసిక్ పార్క్:రీ బర్త్ సినిమా మొదలు పెట్టింది నిర్మాణ సంస్థ. దీనికి డైరెక్టర్ గా గ్యారెత్ ఎడ్వర్డ్స్ (Gareth Edwards)ను ఎన్నుకున్నారు. 2014లో గాడ్జిల్లా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన అనుభవం ఆయనకుంది. స్పీల్ బర్గ్ తీసిన ఫస్ట్ రెండు సినిమాలు ఎందుకు అంత హిట్ అయ్యాయి? అనేదానిపై దృష్టి పెట్టిన ఆయన ఆ బేసిక్స్ తో రీ బర్త్ ను డిజైన్ చేసారు. అందుకే సినిమాలో చాలా సంఘటనలు మనకు జూరాసిక్ పార్క్, ది లాస్ట్ వరల్డ్ సినిమాలను జ్ఞప్తికి తెస్తాయి. అదే ఈ సినిమా కు ప్లస్ గా మారింది. అందుకే ఆ రెండూ చూసిన వాళ్లకు ఈ సినిమా కూడా నచ్చుతుంది.
ఫ్యామిలీ తో చూడవచ్చా?మూడు వేరు వేరు రకాల డైనోసార్ల నుండి శాంపిల్స్ సేకరించడం మధ్యలో డిఫరెంట్ డైనాసార్ల వేట నుండి తప్పించుకోవడం T rex, స్పైనో సారస్ సహా చాలా రకాల డైనోసార్లతో మనుషుల ఎన్కౌంటర్ ఆకట్టుకుంటాయి. అలాగే ఒక బుజ్జి డైనోసార్‌తో ఒక పాప ఫ్రెండ్షిప్ చిన్న పిల్లలను అలరిస్తుంది. చివర్లో హైబ్రిడ్ D rex, Mutadons లాంటి భయంరమైన డైనోసార్ల నుండి జోరా టీమ్ ఎలా బయట పడింది? అనే అంశాలు థ్రిల్ కు గురి చేస్తాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడవచ్చు.
Also Read: 'తమ్ముడు' రివ్యూ: అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? నితిన్ సినిమా హిట్టా? ఫట్టా?
మైనస్ పాయింట్స్ ఏమిటి?జూరాసిక్ పార్క్ రీ బర్త్ స్టోరీ లైన్ చాలా చిన్నది. అందుకే విమర్శకులు దానిపై పెదవి విరుస్తున్నారు. కానీ స్పెషల్ ఎఫెక్స్ట్ పరంగా, యాక్షన్ సీక్వెన్స్ పరంగా ఈ సినిమా టాప్ లో ఉంటుంది. అయితే మెయిన్ విలన్ D-rex చూడడానికి డైనోసార్ కన్నా ఏలియన్ సిరీస్ లోని xenomorphకి దగ్గరగా డిజైన్ చేయడం వింతగా అనిపిస్తుంది. జూరాసిక్ పార్క్ లోని సర్ ప్రైజ్, ది లాస్ట్ వరల్డ్ లోని చిల్లింగ్ ఎలిమెంట్స్ రెండూ ఈ సినిమాలో తెలివిగా కలిపాడు డైరెక్టర్ ఎడ్వర్డ్స్ . కథ చిన్నదే అయినా పిల్లలతో సరదాగా ఈ వీకెండ్ చూసేయతగ్గ సినిమా ఇది.