Juhi Chawla : గత కొన్ని రోజుల క్రితం కండల వీరుడు సల్మాన్ ఖాన్, మాజీ నటి జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, ఆ విషయం తన తండ్రితోనూ చెప్పానన్నారు. కానీ వాళ్ల నాన్న ఒప్పుకోలేదని చెప్పారు. ఈ విషయంపై తాజాగా నటి జూహీ చావ్లా స్పందించారు. తన కెరీర్ అప్పుడే మొదలైంది. అప్పటికి సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ కాదని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి అని అందరికీ తెలుసిందే. ఈవెంట్‌లు, ఇంటర్వ్యూలు లేదా సోషల్ సర్వీసులు.. ఇలా ఏదైనా సరే, 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' స్టార్.. ఎల్లప్పుడూ తన హృదయంలో ఉన్నదే చెప్తూ ఉంటాడు. ఎప్పుడూ పెళ్లి అనగానే.. మాట దాటవేసే సల్మాన్.. ఇటీవల ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పటి హీరోయిన్ జూహీ చావ్లా వ్యక్తిత్వా్న్ని ఇష్టపడి తాను ఆమెను పెళ్లాడాలనుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ ప్రతిపాదనను జూహీ వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి అడిగానని చెప్పారు. జూహీను తనకిచ్చి పెళ్లి చేయాలని అడిగితే.. దానికి ఆయన ఒప్పుకోలేదని అన్నారు. ఎందుకు? అని అడిగితే ‘తాను వాళ్లకి సరిపోనని అనుకున్నారో ఏమో’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో గత కొన్ని రోజుల క్రితం ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి తెగ వైరలైంది. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. దాదాపు పాతికేళ్ల కిందట సల్మాన్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ కావడం విశేషం.
ఈ వీడియోపై తాజాగా జూహీ చావ్లా స్పందించారు. ఇప్పటికే స్టార్ హీరోస్ అయిన అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద హీరోలతో కలిసి పని చేసిన ఆమె.. కానీ సల్మాన్ ఖాన్ తో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన ఓ పాత వీడియోలో జుహీని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, ఆ విషయాన్ని ఆమె తండ్రితో చెబితే రిజక్ట్ చేశారని తెలిపారు. ఈ వార్తలపై జూహీ స్పందిస్తూ.. అప్పట్లో సల్మాన్ తో సినిమా చేయలేదన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఇండస్ట్రీలో తాను అప్పుడే కెరీర్ ప్రారంభించానని చెప్పింది. సల్మాన్ ఖాన్ ఆ సమయంలో సూపర్ స్టార్ కాదని పేర్కొంది. సల్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఓ సినిమాలో అవకాశం వచ్చినా.. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం చేయలేకపోయానని వాపోయింది.
ఆ రోజును సల్మాన్ ఖాన్ ఇప్పటికీ గుర్తు చేస్తుంటాడని జూహీ తెలిపింది. తనతో సినిమా చేసే అవకాశం ఇవ్వలేదని ఇప్పటికీ అంటుంటాడని చమత్కరించింది. కానీ తాను అలా చేయకపోవడానికి అప్పట్లో పలు కారణాలున్నాయని, అందుకే చేయలేకపోయానని మరోసారి చెప్పింది. కానీ సల్మాన్ ఇప్పటికీ ఆ విషయం వదిలిపెట్టడని చెప్పింది ‘‘నువ్వు నాతో సినిమా చేయలేదు’’ అని ఇప్పటికీ ఆటపట్టిస్తూ ఉంటాడని తెలిపింది. తామిద్దరం కలిసి సినిమాల్లో చాలా కష్టపడ్డామన్న జూహీ.. చాలా స్టేజ్ షోలు కూడా చేశామని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా1995 లో జుహీ వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. ఇక సల్మాన్ ఖాన్, జుహీ కలసి ‘దీవానా మస్తానా’(1997) లో కలసి పనిచేశారు. తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో కూడా జుహీ అతిథిగా కనిపించింది.
ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీ షెడ్యూల్ లో గడుపుతున్నారు. గతంలో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించి తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చిన సల్మాన్... రీసెంట్ గా బాలీవుడ్ లో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో నటించారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీను ఏప్రిల్ 21 న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సల్మాన్ ‘టైగర్ 3’ లో నటించనున్నారు.