Devara to release on Dussehra 2024: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'దేవర'. తొలుత ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ తేదీకి సినిమా రావడం లేదని కొన్ని రోజుల క్రితం క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఆ విషయాన్ని ఎన్టీఆర్ అఫీషియల్‌గా చెప్పారు. న్యూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
దసరాకు దేవర పార్ట్ 1 విడుదల
10.10.2024... అక్టోబర్ 10న 'దేవర' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అక్టోబర్ 10 గురువారం వచ్చింది. లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ సీజన్ సినిమాకు కలిసి వస్తుందని చెప్పాలి.
'జనతా గ్యారేజ్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ఇందులో ఆయన జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు.
'దేవర' వాయిదాకు కారణాలు ఏమిటి?
Reasons for Devara release postpone: అసలు 'దేవర'ను వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వెనుక పలు కారణాలు ఉన్నాయని టాక్! అందులో మొదటిది... ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.
'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ మార్కెట్ పాన్ ఇండియా దాటి జపాన్ వరకు చేరింది. ఆ సినిమా రాజమౌళి, 'బాహుబలి' బ్రాండింగ్ వల్ల విదేశాల్లోనూ బాగా ఆడింది. అయితే హోమ్ గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ కదా! తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో జూ ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్. ఆయన సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 5కు అటు ఇటుగా ఉండవచ్చని వినబడుతోంది. అందుకని, వాయిదా వేయాలని భావిస్తున్నారట.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని, ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్ ట్యూన్ ఫైనలైజ్ చేయలేదని ఫిల్మ్ నగర్ గుసగుస. పాన్ ఇండియా రిలీజ్ అంటే రెండు మూడు నెలల ముందు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి. సాంగ్స్ విడుదల చేయాలి. సో... ప్రజెంట్ అటువంటి సిట్యువేషన్ కనిపించడం లేదు.
Also Read: ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?
'దేవర' సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యారు. చిన్న చిన్న గాయాల కారణంగా చికిత్స తీసుకోవడానికి వెళ్లారు. డిశ్చార్జి అయినప్పటికీ... ఆయన మీద తీయాల్సిన సన్నివేశాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ అవి త్వరగా తీసినా... మ్యూజిక్ లేట్ కావడం, ఏపీ ఎలక్షన్స్ వంటివి వాయిదాకు దారి తీశారని టాక్.