Devara Movie First Single: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర' జాతర మొదలైంది. మూవీ టీం ఇక ప్రమోషన్స్‌ షురూ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. టాలీవుడ్‌ పాన్‌ ఇండియా మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో 'దేవర' మూవీ ఒకటి. కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న దేవర నుంచి తాజాగా మూవీ టీం ఓ క్రేజీ అప్‌డేట్‌ వదిలింది. దేవర ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌పై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు.


"పెను తుఫాన్‌ కోసం అంత సెట్‌ అయ్యింది. దేవర ఫస్ట్‌ సింగిల్‌ ఫియర్‌ సాంగ్‌ రాబోతుంది. మే 19న ప్రతి తిరాన్ని చుట్టుముట్టేందుకు సునామీ రాబోతుంది" అంటూ దేవర టీం మూవీపై హైప్‌ క్రియేట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఫియర్‌ సాంగ్‌ అంటే ఇది ఏ రేంజ్‌లో ఉండబోతుందా? అని అంచనాలు వేసుకుంటున్నారు. కాగా మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌డే నేపథ్యంలో ముందు రోజే మూవీ టీం ఫ్యాన్స్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ చూసి ఫ్యాన్స్‌ అంతా తెగ సంబరపడిపోతున్నారు. 






'దేవర'కు కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచంద్రర్‌‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన మ్యూజిక్‌తో కోలీవుడ్‌లో‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. తెలుగులోనూ పలు చిత్రాలకు మ్యూజిక్‌ అందించి హిట్‌ కొట్టాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో దేవర ఆడియో, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌పై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ఈ క్రమంలో దేవర నుంచి పస్ట్‌ సాంగ్‌ రాబోతుండటంతో ఫ్యాన్స్‌ అంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ కోసం అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్‌ అందించాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల దేవర మ్యూజిక్‌పై మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టిల్లు స్క్వేర్‌' సక్సెస్‌ పార్టీ నేపథ్యంలో విశ్వక్‌ సేన్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ దేవర మ్యూజిక్‌ ఎలా ఉండబోతుందో శాంపిల్‌ వినిపించాడట.


ఇక ఇది విన్న విశ్వక్‌ ట్వీట్‌ చేస్తూ "దేవర మ్యూజిక్‌ ఉందమ్మా.. నెక్ట్‌ లెవల్‌. అనిరుధ్‌ రవిచందర్‌ అదరగొట్టాడు. అల్బం పిచ్చేక్కిస్తుందంటే" అంటూ రాసుకొచ్చాడు. కాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె 'దేవర'నిర్మిస్తున్నారు. ఇక రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తుండగా.. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతికథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు.