Devara Collection Day 3: బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊచకోత... మూడు రోజుల్లు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు

Devara 3rd Day Collection: బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ మూవీ దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 300 కోట్ల మార్క్ ను దాటింది. దీని మీద సినిమా యూనిట్ ఏం ట్వీట్ చేసింది?

Continues below advertisement

Devara movie 3 days collection worldwide: మ్యాన్‌ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో తెరకెక్కిన 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 304 కోట్లు వసూళు చేసింది. తొలి రోజు రూ. 172 కోట్లు సాధించిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 243 కోట్లు సంపాదించింది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా మూడు రోజుల వసూళ్ల వివరాలను వెల్లడించింది.

Continues below advertisement

రూ. 300 కోట్ల మార్క్ దాటిన ‘దేవర’

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సినిమా మూడో రోజు 27.65 కోట్లు నెట్ సాధించింది. హిందీలో రూ. 11 కోట్లు, కన్నడలో రూ. 35 లక్షలు, తమిళంలో రూ. 1.5 కోట్లు, మలయాళంలో రూ. 25 లక్షలు కలుపుకుని దేశ వ్యాప్తంగా రూ. 40.30 కోట్ల నెట్ సాధించినట్లు వెల్లడించాయి. ఓవర్సీస్ లో రూ. 7 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా ఈ సినిమా మూడో రోజు సుమారు రూ. 60 కోట్లకు పైగా సాధించింది. మూడు రోజుల్లో ఈ సినిమా మొత్తం రూ. 304 కోట్లకు చేరుకుంది.   

తొలి రోజు రూ. 172 కోట్లు.. రెండో రోజు రూ.243 కోట్లు

భారీ అంచనాల నడుమ విడుదలైన ‘దేవర’ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 82.10 కోట్లు అందుకుంది. తమిళంలో రూ. 1.5 కోట్లు, కన్నడలో రూ. 6.40 కోట్లు, కేరళలో రూ. 25 లక్షలు, హిందీలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 24.70 కోట్లు కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా రూ. 98.60 కోట్ల షేర్, రూ. 172 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు కూడా ‘దేవర’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.16 కోట్లు, మిగతా భాషల్లో రూ. 10 కోట్లు సాధించింది.  ‘దేవర’ రెండు రోజుల్లో రూ. 243 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ లో ‘దేవర’ అదుర్స్

‘RRR’ సినిమా తర్వాత వచ్చిన ‘దేవర’ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో  ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్దమొత్తంలో జరిగింది.  నైజాంలో రూ. 44 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, ఆంధ్రాలో రూ. 46.55 కోట్లతో టోటల్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ. 112.55 కోట్ల బిజినెస్ చేసింది. కన్నడలో రూ. 16 కోట్లు, తమిళంలో రూ. 6 కోట్లు, మలయాళంలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ. 27 కోట్లు కలుపుకుని టోటల్ గా రూ. 182.55 కోట్ల బిజినెస్ జరిగింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించగా, విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ‘దేవర’ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

Read Also: ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు... లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం

Continues below advertisement
Sponsored Links by Taboola