Devara Ayudha Pooja Postponed: ఫ్యాన్స్, ఆడియన్స్‌కి 'దేవర' టీం షాకిచ్చింది. అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్రేజీ అప్‌డేట్ రావడం లేదంటూ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైయిటెడ్ చిత్రం 'దేవర'. రెండు భాగాలుగా వస్తున్న దేవర ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది.
మరో 8 రోజుల్లో థియేటర్లోకి
అలాగే జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా పాటలు యూట్యూబ్‌లో మారుమోగుతున్నాయి. ఇక ట్రైలర్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌కు ఇంకా 8 రోజులే ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది దేవర టీం. మూవీ నుంచి నాలుగో పాటను రిలీజ్ చేస్తున్న నిన్న ఓ ప్రకటన ఇచ్చింది. ఆయుధ పూజకు సిద్ధం అవ్వండి అంటూ ప్రేక్షకులను అలర్ట్ చేశారు.
ఆయుధ పూజ వాయిదా
సెప్టెంబర్ 19న ఉదయం 11.07 గంటలకు ఆయుధ పూజ వచ్చేస్తుందంటూ బజ్ పెంచారు. దీంతో ఈ పాటకు ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఊహించని షాక్ ఇచ్చింది టీం. ఆయుధ పూజ రేపు రావడం లేదంటూ ఫ్యాన్స్ ఆశలను నీరుగార్చింది. "ఆయుధ పూజ అనేది పూర్తి స్థాయిలో ఘనంగా జరుపుకోవాల్సిన ఒక మ్యాడ్ సాంగ్. కనుక రేపు పాట విడుదల కాదు" అంటూ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కానీ, మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయమని, మీ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం అందిస్తామంటూ ఫ్యాన్స్‌కి హామి ఇచ్చింది దేవర టీం.
ప్రోమో ప్లీజ్
ఇది చూసి కొందరు నెటిజన్లు కనీసం సాంగ్ సంబంధించి ప్రొమో అయినా, చిన్న బిట్ అయినా ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం పాటను వాయిదా వేశారా? లేక రిలీజ్‌నే ఆపేశారా? అని ఆరా తీస్తున్నారు. అయితే థియేటర్లో డైరెక్ట్‌గా రచ్చేనా? రెండు బ్లాస్ట్ థియేటర్లోనే అన్నమాట అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దేవరలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రతికథానాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
Also Read: పరారీలో జానీ మాస్టర్ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!