Jayasudha: సీనియర్ నటి జయసుధకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ.. ఇండస్ట్రీలో తను సన్నిహితంగా ఉండేవారి గురించి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తను నిర్మాతగా తెరకెక్కించిన ‘హ్యాండ్సప్’ సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. అసలు ఆ మూవీలో నటించడానికి చిరంజీవి ఎలా ఒప్పుకున్నారు? మూవీ చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అని బయటపెట్టారు జయసుధ.
అలవాటు లేదు..
‘‘ఇండస్ట్రీలో కొంతమందిని నేను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. కానీ కుటుంబం అంటే కుటుంబమే. మోహన్ బాబు, మురళీ మోహన్ నన్ను చెల్లెమ్మ అన్నారు కాబట్టి వాళ్లను అన్నయ్య అంటాను తప్పా అందరినీ అన్నయ్య, అక్క అని పిలిచే అలవాటు నాకు లేదు. ఎవరైనా అలా అనుకున్నా కూడా అలా ఎలా అనుకుంటారు అనిపిస్తుంది. నాకు అలాంటివి అలవాటు లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు జయసుధ. చాలావరకు ఈ నటి జీవితంలో జరిగిన పర్సనల్ విషయాలు చాలామంది ప్రేక్షకులకు తెలుసు. ఆ విషయాన్ని తాన్నే స్వయంగా ఒప్పుకుంటారు కూడా. దానిపై ఆమె స్పందిస్తూ.. చాలామంది హీరోలు కూడా తనలా మాట్లాడాలనుకుంటారు కానీ మాట్లాడలేరు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు జయసుధ.
సరదా సంభాషణ..
జయసుధ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు లీడ్ రోల్ చేసిన మూవీ ‘హ్యాండ్సప్’. అందులో నాగబాబు కూడా మరో లీడ్ రోల్‌లో నటించారు. చిరంజీవికి, జయసుధకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండడంతో అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేసి సినిమా ఎలా నడుస్తుందని కనుక్కునేవారు ఆమె గుర్తుచేసుకున్నారు. అలా ఒకానొక సందర్భంగా తనకేమైనా రోల్ ఉందా అని సరదాగా అడిగారని అన్నారు. అప్పుడే దర్శకుడు శివ నాగేశ్వర రావు వచ్చి క్లైమాక్స్‌లో ఒక పెద్ద హీరో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. అదే విషయంపై చిరంజీవిని ఆ రోల్ కోసం సంప్రదించారట జయసుధ.
ఆ లెవెల్‌లో లేదు..
‘హ్యాండ్సప్’లో క్యామియో చేయడానికి చిరంజీవిని సంప్రదించగా.. స్పెషల్ అప్పీయరెన్స్ అనేది అసలు మన ప్రేక్షకులకు అర్థమవుతుందో లేదో అని అన్నారని గుర్తుచేసుకున్నారు జయసుధ. ‘‘ఆ సమయంలో బాలీవుడ్ అనేది మనకంటే చాలా ముందు ఉంది. అమితాబ్ బచ్చన్ సడెన్‌గా ఒక సినిమాలో కనిపించడం లాంటివి ఉండేవి. వాళ్లు హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అయ్యేవారు. ఆ లెవెల్‌కు మనవాళ్లకు అర్థమవుతుందో లేదో అని చిరంజీవి అన్నారు. డౌట్ ఉన్నా కూడా సినిమా చేశారు కానీ పోస్టర్‌లో మాత్రం ఆయన ఫోటో వేయొద్దు అని చెప్పారు ఎందుకంటే నేను చివర్లో వస్తాను కదా అన్నారు’’ అని బయటపెట్టారు. ‘హ్యాండ్సప్’ కథ విన్నప్పుడు చిరంజీవికి నచ్చినా సినిమా చూశాక ఆయనకు అస్సలు నచ్చలేదని ఓపెన్‌గా చెప్పేశారు జయసుధ.
Also Read: త్రివిక్రమ్ చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, ఆ మూవీకి డైలాగ్స్ రాయనన్నారు: విజయ్ భాస్కర్