Janhvi Kapoor About Mr and Mrs Mahi: మామూలుగా ఇంటిమేట్ సీన్స్ చేయడం హీరోకు అయినా, హీరోయిన్‌కు అయినా కష్టమే అని ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు బయటపెట్టారు. ఎంతోమంది దీనిపై ఓపెన్‌గా మాట్లాడారు. తాజాగా ఆ లిస్ట్‌లో జాన్వీ కపూర్ కూడా యాడ్ అయ్యింది. రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ మే 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జాన్వీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఇందులో రాజ్‌కుమార్ రావుతో చేసిన ఇంటిమేట్ సీన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ యంగ్ బ్యూటీ.
అలా కనిపించాలి..
చాలా గంటలు విరామం లేకుండా షూటింగ్ చేసిన తర్వాత రాజ్‌కుమార్ రావుతో కలిసి ఒక కిస్ సీన్‌లో యాక్ట్ చేయాల్సి వచ్చిందట జాన్వీ కపూర్. ఆ సందర్భాన్ని తను ప్రేక్షకులకు వివరించింది. ‘‘నేను, రాజ్‌కుమార్ వరుస షూటింగ్ వల్ల పూర్తిగా అలసిపోయిన తర్వాతే ఎక్కువశాతం మా రొమాంటిక్ సీన్స్‌కు షూటింగ్ జరిగింది. నాకు గుర్తున్నంత వరకు మా మొదటి రొమాంటిక్ సీన్ అనేది 20 గంటల షిఫ్ట్ తర్వాత జరిగింది. అప్పటికే మేమిద్దరం కష్టపడి చచ్చిపోయాం. అయినా కూడా మేము స్క్రీన్ పై అప్పుడే ప్రేమలో పడిన జంటలాగా, అప్పుడే ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న కపుల్‌లాగా కనిపించాలి. కానీ నిజానికి మేము అప్పటికే అలసటతో ప్రాణం పోయేంత స్టేజ్‌లో ఉన్నాం’’ అని జాన్వీ కపూర్ గుర్తుచేసుకుంది.
కామెడీ ఎక్స్‌పర్ట్..
జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు కలిసి నటించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ ఇద్దరి మూడేళ్ల క్రితం హార్దిక్ మెహ్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రూహీ’ అనే హారర్ కామెడీలో కలిసి కనిపించారు. ‘రూహీ’కి, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’కి చాలా తేడా ఉంది. దీంతో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించడం ఎలా అనిపించిందో చెప్పుకొచ్చింది జాన్వీ. ‘‘రూహీలో రాజ్‌కుమార్, వరుణ్ లాంటి కామెడీ ఎక్స్‌పర్ట్స్‌తో కలిసి పనిచేశాను. వాళ్లతో కలిసి చేస్తున్నప్పుడు నాకు అర్థమయ్యింది ఏంటంటే నేను కామెడీ చేయడానికి ఎక్స్‌ట్రాగా కష్టపడాల్సిన అవసరం లేదు’’ అంటూ రాజ్‌కుమార్ రావు కామెడీ టైమింగ్‌ను ప్రశంసిస్తూ, తను ఒక కామెడీ ఎక్స్‌పర్ట్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది జాన్వీ కపూర్.
ఇద్దరూ బిజీ..
2024లో జాన్వీ కపూర్ కాల్ షీట్స్ అన్నీ దాదాపుగా ఫుల్ అయిపోయాయి. అందులో ముందుగా షరన్ శర్మ తెరకెక్కించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ విడుదలకు సిద్ధమయ్యింది. ఇది మాత్రమే కాకుండా ‘ఉలఝ్’ అనే ఒక లేడీ ఓరియెంటెండ్ స్పై డ్రామా కూడా త్వరలోనే విడుదల కానుంది. దాంతో పాటు ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’, ‘కర్ణ’, ‘దేవర’ వంటి చిత్రాలతో బిజీగా ఉంది జాన్వీ. ఇక రాజ్‌కుమార్ రావు విషయానికొస్తే.. తను ఇటీవల ‘శ్రీకాంత్’ అనే బయోపిక్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్’ లాంటి క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కథతో అందరినీ అలరించడానికి వచ్చేస్తున్నాడు. దీంతో పాటు తన ఖాతాలో ‘విక్కీ విధ్యా కా వో వాలా వీడియో’, ‘స్త్రీ 2’ కూడా ఉన్నాయి.
Also Read: డైరెక్టుగా ఓటీటీలోకి ఆమిర్ ఖాన్ కుమారుడి డెబ్యూ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?