Janhvi Kapoor Hurt by Tennis Ball Comments: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన ఈ సినిమాలో మహి పాత్ర పోషించింది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు.


క్రికెట్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన జాన్వీ


అటు సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె భుజానికి గాయాలు అయినట్లు కనిపించింది. నిజానికి ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సుమారు 150 గంటలకు పైగా క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే రెండు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు ఆమె తన ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆమె కష్టాన్ని చూసి చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించగా, మరికొంత మంది మాత్రం ట్రోల్ చేశారు. అయితే, మరీ చీప్ కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు జాన్వీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చి నోరు మూయించింది.


నెటిజన్ కామెంట్ కు జాన్వీ కౌంటర్


భుజానికి గాయమైన వీడియో చూసి ఓ నెటిజన్‌ జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేశాడు. టెన్నిస్‌ బాల్‌‌తో ఆడిన క్రికెట్‌ లో మీకు దెబ్బలు తగిలాయా? అంటూ హేళన చేశాడు. నవ్వు ఎమోజీలు పెట్టాడు. ఈ కామెంట్ కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “నాకు క్రికెట్ బాల్ తో ఆడుతున్నప్పుడే గాయాలు అయ్యాయి. అందుకే టెన్నిస్ బాల్ తో ఆడాల్సి వచ్చింది. నా భుజానికి ఉన్న బ్యాండేజ్ చూస్తే మీకు ఆ విషయం అర్థం అవుతుంది. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు ఓసారి అసలు వీడియో మొత్తం చూస్తే బాగుంటుంది. అప్పుడు మీరు వేసే జోక్స్ కు నేను కూడా నవ్వుతాను” అంటూ రిప్లై ఇచ్చింది. ఈ కౌంటర్ తో నెటిజన్ షాక్ అయ్యాడు. ‘సారీ మేడం’ అని చెప్పి సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'


'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రానికి కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగుందని చెప్తున్నారు. అటు జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘RC 16’లో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.


Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత