సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత శుక్రవారం మలయాళ నటి అపర్ణ నాయర్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదఛయాలు అలుముకున్నాయి. ఆమె మరణాన్ని మరవక ముందే సెప్టెంబర్ 2 న ప్రముఖ తమిళ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఆర్.ఎస్ శివాజీ మృతి చెందారు. ఇక అదే తమిళ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు డైరెక్టర్ మారిముత్తు మృతి చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించారు.


ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలోనే ఆయనకి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. 57 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. జైలర్ లో పన్నీరు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. సినిమాలో విలన్ కు నమ్మకస్తుడిగా ఉండే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకు సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మారి ముత్తు.


రీసెంట్ తమిళ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ 'విక్రమ్' సినిమాలో కూడా ఆయన నటించారు. అలాగే ఇటీవల ఆయన రాసిన 'హే ఇందమ్మ' అనే పద్యం విస్తృతంగా చర్చనీయాంశమైంది.  ఇండస్ట్రీలో మొదట సహాయ దర్శకుడిగా తన జర్నీని స్టార్ట్ చేసిన మారి ముత్తు, ఆ తర్వాత నటుడిగా మారారు. 1999లో అజిత్ నటించిన 'వాలి' సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 2008లో 'కన్నుమ్ కన్నుమ్' అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. డైరెక్టర్ గా మారకముందు మణిరత్నం, వసంత సీమన్, SJ సూర్య లాంటి ప్రఖ్యాత దర్శక నిర్మాతల దగ్గర సహాయ దర్శకుడిగా మంచి నైపుణ్యాన్ని కనబరిచారు.


Also Read : 'తురుమ్ ఖాన్‌లు' రివ్యూ : ముగ్గురు హీరోలు నవ్వించారా? టార్చర్ పెట్టారా?


తమిళ ఇండస్ట్రీలో నటులు, దర్శకులు, నిర్మాతలు అందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. సన్ టీవీలో 'యాంటీ స్విమ్మింగ్' అనే సీరియల్ లో నటించి బుల్లితెర ఆడియన్స్ ని అలరించారు. ఆ సీరియల్ తో టీవీ రంగంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక చివరగా రజనీకాంత్ 'జైలర్' సినిమాలో మంచి పాత్ర పోషించి అలరించారు. ఇక ఆయన మరణ వార్త తమిళ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మంచి నటుడిని కోల్పోయామంటూ ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనవుతున్నారు.


Also Read : సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదలైన 'రామన్న యూత్' ట్రైలర్!






Join Us on Telegram: https://t.me/abpdesamofficial