'జైలర్'... సూపర్ స్టార్ రజనీకాంత్ ఇమేజ్ రీ డిస్కవర్ చేసిన సినిమా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా భారీ హిట్ సాధించింది. సుమారు 200 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు.
అనౌన్స్‌మెంట్ అంటే ఇట్టా ఉండాలా!
అభిమానుల్లో రజని మీద ఉన్న అంచనాల మీద నడిచిన సినిమా 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ రాసిన కథ కంటే... రజనీకాంత్ కోసం రాసిన ఎలివేషన్ షాట్స్ ఎక్కువ హైలైట్ అయ్యాయి. సూపర్ స్టార్ అలా నడిచి వస్తుంటే... అనిరుద్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ ఆ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. దాంతో సీక్వెల్ సెట్స్ మీదకు తీసుకు వెళ్తున్నారు.
'జైలర్' విజయం వెనుక కీలక పాత్ర ఏమిటో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar)కు తెలియనిది కాదు. ఆ సినిమా వచ్చినప్పుడు ఎటువంటి అంచనాలు లేవు. కానీ ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. అది ఆయనకు తెలుసు. అంచనాలు అందుకునే విధంగా తాను సినిమా తీయబోతున్నానని చెప్పేలా జైలర్ 2 అనౌన్స్ వీడియో రూపొందించారు. ఇందులో రజనీకాంత్ కళ్ళజోడు అలా పెట్టుకుంటుంటే వెనకాల బ్లాస్ట్ జరగడం, దానికి ముందు రౌడీలను తూటాలతో వేటాడడం వంటి సన్నివేశాలు అభిమానులు అందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి. అనౌన్స్‌మెంట్ కోసం రూపొందించిన వీడియోలో అనిరుద్, నెల్సన్ తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
జైలర్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ సీక్వెల్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ ఏడాది విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: బేబీ క్రేజ్ బావుందమ్మా... రెండు తమిళ్ సినిమాల్లో వైష్ణవి చైతన్యకు ఛాన్స్