పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' గుర్తు ఉందా? అందులో హీరో ప్రియదర్శి చాలా సన్నివేశాల్లో మాస్కుతో కనిపిస్తారు. చివరకు ఫేస్ రివీల్ చేస్తారు. ఇప్పుడు 'జగన్నాథ్' ట్రైలర్ చూస్తే ఆ మాస్క్ గుర్తుకు వస్తుంది. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమైంది.
రాయలసీమ భరత్ హీరోగా...'జగన్నాథ్' సినిమాతో రాయలసీమ భరత్ హీరోగా పరిచయం అవుతున్నారు. భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పీలం పురుషోత్తం నిర్మిస్తున్న చిత్రమిది. భరత్, సంతోష్ - దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో పాటు ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. డిసెంబర్ 19న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
భరత్ హీరోగా నటించడంతో పాటు దర్శక నిర్మాణంలో భాగస్వామి అయిన ఈ సినిమాను యాక్షన్, లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే టోటల్ యాక్షన్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. రాయలసీమ భరత్ హీరోగా నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా అజయ్, బాహుబలి ప్రభాకర్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, 'జబర్దస్త్' అప్పారావు, 'షేకింగ్' శేషు, అంబటి శ్రీనివాస్, ఎఫ్ఎం బాబాయ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి శేఖర్ మోపూరి సంగీత దర్శకుడు.