Cinematographer Jagadeesh Cheekati interview: ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి సంబంధించి మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా విజువల్స్ పరంగా ట్రెమండస్ రెస్సాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందించారు. విజువల్స్ పరంగా అత్యున్నతంగా ఈ సినిమా ఉందనేలా జగదీష్ చీకటి పనితనాన్ని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా ఆయన అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్ చీకటి మీడియాకు తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..
నేపథ్యం - సినీ ప్రయాణంనేను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు పొందాను. నాకు డ్రాయింగ్, ఫోటోగ్రఫీ అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. ఫోటోగ్రఫీలోనూ మాస్టర్స్ చేశా. దూరదర్శన్‌లో కూడా కొంతకాలం పని చేశా. స్టిల్ ఫోటోగ్రఫీలోనూ అవార్డులు అందుకున్నాను. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్, ప్రాజెక్టులను చేశా. అప్పుడే నాకు ‘జత కలిసే’ మూవీకి సినిమాటోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. కొత్త వాళ్లందరం కలిసి ఆ సినిమా చేశాం. ఆ సినిమా తర్వాత ‘నాయకి’, ఆర్జీవీ ప్రొడక్షన్స్ నుంచి ‘భైరవ గీత’ ఇలా వరసగా చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి.
ఫ్యామిలీ సపోర్ట్మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేస్తారు. నన్ను ఎంకరేజ్ చేస్తూ.. నాకెప్పుడూ సపోర్ట్ ఇచ్చేవారు. నీకు నచ్చిన పని ఏదైనా చేసుకోమని, అందులో వంద శాతం ఎఫర్ట్ పెట్టమని చెప్పేవారు. నేను దూరదర్శన్‌లో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసినప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.
‘అర్జున్ చక్రవర్తి’ - వర్క్ ఎక్స్‌పీరియెన్స్ప్రజంట్ మన ఇండియాలో గొప్ప గొప్ప టెక్నీషియన్స్‌కు కొదవలేదు. హాలీవుడ్ స్థాయిలో అవుట్ ఫుట్ ఇస్తున్నాం. ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమాకు ఆ స్థాయి లుక్ వచ్చేందుకు నేచురల్ లైటింగ్‌నే వాడాం. సౌండ్, సినిమాటోగ్రఫీ ఏదైనా కూడా దర్శకుడి విజన్‌కు తగ్గట్టే ఉంటుంది. సినిమా సక్సెస్‌లో ఈ డిపార్ట్‌మెంట్‌ల పాత్ర చాలా ఉంటుంది. దర్శకుడి మైండ్‌తో సింక్ అవ్వాలి, అదే టైమ్‌లో ప్రొడక్షన్ సపోర్ట్ ఉండాలి. అప్పుడే రిజల్ట్ బాగా వస్తుంది. డీఓపీ అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అంటే, అతను కూడా ఓ డైరెక్టరే. అందుకే దర్శకుడితో సింక్ అవుతూ, అతని విజన్‌ను అర్థం చేసుకోవాలి. అతనితో క్రియేటివ్ డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాలి. అలా నాకు దర్శకుడితో సింక్ కానప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసినా వేస్ట్. అలా నేను ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు కూడా వచ్చేశా.
‘అర్జున్ చక్రవర్తి’ - ఎదురైన సవాళ్లుమంచు కురిసే ప్రాంతంలో షూటింగ్ చేయడం సవాల్‌లో కూడుకున్న వ్యవహారం. ఓసారి మంచు కురిసే ప్రాంతం కావాల్సి వచ్చి కాశ్మీర్‌కు వెళ్లాం. మేము వెళ్లినప్పుడు అక్కడ మంచు పడటం లేదు. మంచు కురిసే వరకు వెయిట్ చేశాం. చివరకు మైనస్ 8 డిగ్రీల వరకు వెళ్లింది. అలా మంచు కురుస్తుంటే స్వర్గమంటే ఇదేనేమో అన్నట్టుగా అనిపించింది. మేము అనుకున్న దాని కంటే కూడా బాగా షూట్ చేశాం. ఫైనల్‌గా విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఆ మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. టెక్నికల్‌గా చాలా ఇబ్బంది పడ్డాం. 800 మందిని, ప్లేయర్స్‌ని టైమ్ స్లైస్ అనే ఓ పరికరంతో షూట్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ, అది అందుబాటులో లేకపోవడంతో ఫ్రీజ్‌లో పెట్టి షూట్ చేశాం. అది చాలా ఎఫెక్ట్‌ను, నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు‘అర్జున చక్రవర్తి’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు తెచ్చిపెట్టింది. కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత కష్టపడ్డామో.. అంత గుర్తింపు వచ్చిందని భావించాను. దీనికి దర్శకుడు విక్రాంత్ రుద్ర, హీరోహీరోయిన్లు విజయ్ రామరాజు, సిజా రోజ్‌లతో పాటు దయానంద్ వంటి వారు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. ఈ జర్నీలో నిర్మాత శ్రీని గుబ్బల సపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మీకేం కావాలంటే అది చేయండి కానీ.. డబ్బుని మాత్రం వృథా చేయవద్దని అనేవారు. మధ్యలో కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా.. ఆయన అండగా నిలబడ్డారు.
ఇండస్ట్రీ సపోర్ట్సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేసి, ‘అర్జున్ చక్రవర్తి’ బాగుందని, అందులోనూ నా వర్క్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ అభినందించారు. నిజంగా, మనకే ఇదంతా జరిగిందా? అన్నట్టుగా ఆశ్చర్యపోయాను. థ్యాంక్స్ టు ఆల్.