Nandamuri Mokshagna Teja Heroine Details: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను బాలయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించాడు. దీంతో మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇక తన సినిమా కోసం మోక్షజ్ఞ కూడా సాలీడ్ లుక్‌లోకి మేకోవరైన సంగతి తెలిసిందే.
ప్రశాంత్ వర్మ స్పెషల్ కేర్
బొద్దుగా ఉండే అతడు వర్కౌట్ చేసి ఫిట్‌గా మారాడు. మోక్షజ్ఞ లుక్ విషయంలో ప్రశాంత్ వర్మ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నాడు. దగ్గురుండి మరి తన మూవీ సెట్ అయ్యేలా అతడి మేకోవర్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా అతడి ఎంట్రీి కన్‌ఫాం చేశాడు ప్రశాంత్ వర్మ. సింబా వచ్చేస్తున్నాడంటూ అతడి లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఇదోక సూపర్ హీరో జానర్ అని, హనుమాన్ మించిన రేంజ్‌లో మోక్ష కోసం ప్రశాంత్ స్క్రిప్ట్ రెడీ చేశారంటున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఈ నందమూరి హీరో సరసన నటించే లక్కీ ఎవరా అంతా ఆరా తీస్తున్నారు.
చివరిగా మహేష్ బాబుతో
ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఆమె ఓ సన్సేషన్, ఎంట్రీతో వరుసగా అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. అంతేకాదు బాలయ్య చిత్రంలో ఈ బ్యూటీ నటించింది. మరో ఆసక్తిర విషయమేంటంటే ఆమె బాలయ్యకు ఎంతో ఇష్టమైన హీరోయిన్. ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల. ఇప్పటికే ఈ విషయంపై బాలయ్య గతంలోనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'భగవంత్ కేసరి'లో శ్రీలీల, బాలకృష్ణలు తండ్రికూతురిగా కనిపించారు. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య చిచా అంటూ పిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి శ్రీలీల బాలయ్య ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది.
బాలయ్య హింట్
అయితే భగవంత్ కేసరి మూవీ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. శ్రీలీలతో తాను హీరోగా చేస్తానని ఇంట్లో చెప్పడగానే.. తన కొడుకు మోక్ష తిట్టాడని, ఆమె తన హీరోయిన్ అని, ఆమె పక్కన నటించి తాను హీరో లాంచ్ అవుతానంటే మీరూ హీరోగా చేస్తారంటారేంటి అని చీవాట్లు పెట్టాడంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడంతా మోక్షజ్ఞ సరసన హీరోయిన్‌గా నటించేది శ్రీలీలే అని అంతా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలోనూ ఇదే నిజం అన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మూవీ ప్రకటన తర్వాత దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవల శ్రీలీల మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం నితిన్ సరసన ఆమె రాబిన్ హుడ్ మూవీ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Also Read: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్ - ఆ అప్‌డేట్ రాదంటూ బ్యాడ్‌న్యూస్ - నెటిజన్స్ రియాక్షన్ ఇదే!