Shah Rukh Khan's son Aryan dating rumours: సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ముందు నుంచి షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) పేరు వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అతని పేరు డ్రగ్ కేసులో వినిపించింది. ఆ తర్వాత డేటింగ్ కహాని బయటకు వచ్చింది. ఇప్పుడు బ్రెజిల్ మోడల్, నటితో ఆర్యన్ రిలేషన్షిప్ (Aryan Khan Larissa Bonesi relationship)లో ఉన్నారని ముంబైలో జోరుగా ప్రచారం జరుగుతోంది.


సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులనూ వదల్లేదు!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'తిక్క' గుర్తుందా? ఆ సినిమాలో హీరోయిన్, బ్రెజిల్ మోడల్ లారిస్సా బొనెసి గుర్తుందా? ఆ అమ్మాయిని ఆర్యన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. అందుకు ఓ నెటిజన్ ప్రూఫ్స్ కూడా చూపించాడు.


Also Readబాలయ్య టైటిల్‌తో శర్వానంద్ సినిమా - హీరోయిన్లు ఇద్దరిలో ఒకరికి వరుస హిట్లు, ఇంకొకరికి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు






సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనెసి ఒకరిని మరొకరు ఫాలో అవుతున్నారు. అందులో తప్పు ఏముందని అంటారా? లారిస్సా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లను కూడా ఆర్యన్ ఫాలో అవుతున్నారు. ఆమె కూడా అంతే! ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఫాలో అవుతోంది. అంతే కాదు... ఆర్యన్, లారిస్సా ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌కు అటెండ్ అయ్యారు. అక్కడ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Readఈ నెలలోనే విశ్వక్ సేన్ 'గామి' ఓటీటీ రిలీజ్... ZEE5లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?






లారిస్సా తల్లికి ఆర్యన్ బహుమతి!?
ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనెసికి పరిచయం ఎక్కడ? అని ఆరాలు తీస్తే... షారుఖ్ కొడుక్కి ఒక క్లాతింగ్ బ్రాండ్ ఉంది. దానికి లారిస్సా మోడల్ గా వర్క్ చేసింది. ఆ టైంలో పరిచయమైందని ముంబై గుసగుస. అంతే కాదు... ఇటీవల ముంబై వచ్చిన లారిస్సా తల్లికి ఆర్యన్ ఖాన్ ఒక విలువైన జాకెట్ బహుమతిగా ఇచ్చారట. మరి, డేటింగ్ వార్తలో ఎంత నిజం ఉందో గానీ సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఇప్పడు ఆర్యన్ ఖాన్ వయసు 26 సంవత్సరాలు. లారిస్సాకు 34 ఏళ్లు. వయసులో వాళ్లిద్దరి మధ్య వత్యాసం కూడా డిస్కషన్ పాయింట్ అవుతోంది.


Also Readఆస్పత్రిలో పెద్ద సినిమాలకు పని చేసిన డబ్బింగ్ ఇంజనీర్‌... సర్జరీకి 12 లక్షలు - దాతల కోసం ఫ్యామిలీ ఎదురు చూపులు