HanuMan actor Teja Sajja part of Prabhas' Kalki 2898 AD: ఈ సంక్రాంతికి ఓ చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హనుమాన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా తన నటనతో అదరగొట్టేసాడు. పాన్ ఇండియా లెవెల్ లో మూవీ సక్సెస్ అవడంతో దేశ వ్యాప్తంగా అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇటు హీరో తేజ ఇద్దరికీ భారీ క్రేజ్ వచ్చింది. దీంతో తేజ సజ్జా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో తేజ సజ్జా ఓ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తాజా సమాచారం బయటికి వచ్చింది.


ప్రభాస్ 'కల్కి 2898 AD'లో తేజ సజ్జా


ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898AD'. ఈ ఏడాది టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా సంబంధించి వస్తున్న అప్డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా నెట్టింట క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఓ అప్డేట్ సోషల్ మీడియా అంతట వైరల్ అవుతుంది.


అదేంటంటే, 'కల్కి' మూవీలో 'హనుమాన్' హీరో తేజ సజ్జా సైతం స్పెషల్ క్యామియో చేస్తున్నాడట. తాజాగా 'కల్కి' నిర్మాత అశ్వినిదత్ తో తేజ సజ్జా కలిసి ఫోటో దిగడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. మహాభారతం ఆధారంగా తెరకెక్కుతున్న 'కల్కి' సినిమాలో అభిమన్యు పాత్రలో తేజా సజ్జా నటిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు సినిమాలో ప్రభాస్ తో పాటూ మరికొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా కనిపిస్తాడని, ఫ్లాష్ బ్యాక్ లో ఈ సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఇన్ డైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేసిన హీరో


తేజ సజ్జ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.."కొన్ని ఎక్సైటింగ్ ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉన్నాయి. కొన్ని ఇంట్రస్టింగ్ కొలాబిరేషన్స్ సైతం ఉన్నాయి. నేను వాటిని ఎప్పుడు బయటపెడదామా అని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. నా కెరీర్ లైనప్ గురించి త్వరలోనే చెప్తాను. నేను నటించేందుకు కథలు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని వినోదాత్మక కథలు పరిశీలనలో ఉన్నాయి. వాటి వివరాలు వెల్లడించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా" అని అన్నాడు. ఇది విన్న చాలా మంది నెటిజన్స్ ప్రభాస్ 'కల్కి' గురించే తేజా సజ్జా ఇలా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగూ 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది కాబట్టి తేజా సజ్జాని కచ్చితంగా 'కల్కి'లో తీసుకొని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


Also Read : బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ - అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆరోజే!