ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత సంచలన అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) హవా కొనసాగుతోంది. హీరోల నుంచి మొదలు పెడితే దర్శకులు, ఆఖరికి హీరోల అభిమానులు సైతం తమ సినిమాలకు అనిరుధ్ కావాలని కోరుకుంటున్నారు. దాంతో ఆయనకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకని, ఆయన పారితోషికం కూడా భారీగా పెరిగింది.
నాని 'ది ప్యారడైజ్' కోసం 15 కోట్లు!నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise Movie). దీనికి అనిరుద్ సంగీత దర్శకుడు. హీరోతో ఆయన హ్యాట్రిక్ సినిమా ఇది. దీనికి ముందు 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాలు చేశారు. ఆ సినిమాలకు ఐదారు కోట్ల రూపాయల లోపే తీసుకున్నారట. కానీ, ఈ 'ప్యారడైజ్' కోసం అనిరుధ్ 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే వారం ఓ లవ్ సాంగ్ రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత మరొక స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్.
Also Read: Trisha - Karuppu Update: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
'ప్యారడైజ్' కంటే AA 23కి ఆరు కోట్లు ఎక్కువ!ప్రజెంట్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అనిరుద్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని సినిమా (AA23) కూడా చేస్తున్నారు. ఆ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా 21 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని టాక్. సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన గ్లింప్స్‌కు ఆయన అందించిన సంగీతం బావుందని పేరు వచ్చింది. కానీ, 21 కోట్లు అంటే చాలా ఎక్కువ అని కామెంట్లు వినబడుతున్నాయి.
హీరోలతో సమానంగా సంగీత దర్శకుడు పారితోషికం అందుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అనిరుధ్ తీసుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో కొంత మంది హీరోలకు కూడా లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అనిరుద్ ఇమేజ్, ఆయనకు ఉన్న బ్రాండ్ వేల్యూ వల్ల సినిమాకు వచ్చే హైప్, జరిగే బిజినెస్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఆయన అడిగినంత అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆయన మ్యూజిక్ త్వరగా ఇవ్వడం లేదని, లేట్ చేస్తున్నారని టాక్ ఉంది.
Also Read: Akshara Singh - 'డెకాయిట్' సింగర్‌తో బ్రేకప్... మళ్ళీ ప్రేమలో పడిన అక్షర
