Mahesh Babu's Varanasi Shooting Schedule Faces Water Crisis : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విజువల్ వండర్ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న ఈ గ్లోబ్ ట్రాటర్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు విదేశాల్లోనూ షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో కీలక సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది.

వాటర్ క్రైసిస్... షెడ్యూల్ ఆలస్యం

హైదరాబాద్‌లోనే మరో షెడ్యూల్ ప్లాన్ చేయగా... సమ్మర్ వాటర్ క్రైసిస్‌తో అది ఆలస్యమైందనే వార్తలు వస్తున్నాయి. మూవీ టీం 150 వాటర్ ట్యాంకర్ల కోసం రిక్వెస్ట్ చేయగా... మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. భాగ్యనగరంలో సమ్మర్ అంటేనే నీటి డిమాండ్ మామూలుగా ఉండదు.

కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత అధికంగా ఉంటుంది. ప్రజల అవసరాల నిమిత్తం వాటర్ బోర్డ్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ప్రజల అవసరాల కోసం ఇంపార్టెన్స్ ఇస్తూ... అంత వాటర్ సప్లై చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. మరి మూవీ టీం ఈ షెడ్యూల్ కోసం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.

Also Read : ఓటీటీలోకి 40 కోట్ల రీసెంట్ బ్లాక్ బస్టర్ - డార్క్ కామెడీ 'భరతనాట్యం 2' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ట్రెక్కింగ్ శిక్షణలో మహేశ్ బాబు

షూటింగ్ కాస్త గ్యాప్ దొరికినా మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి ట్రిప్పులకు వెళ్తుంటారు. రీసెంట్‌గా ఆయన జర్మనీ వెళ్లడంతో అంతా అలానే భావించారు. కానీ, మహేశ్ వారణాసి షూటింగ్‌లో భాగంగానే అక్కడకు వెళ్లినట్లు ఇన్ స్టా వేదికగా ఫోటోస్ షేర్ చేశారు. జర్మనీ బ్లాక్ ఫారెస్ట్‌లో ఫిట్ నెస్, వెల్ నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో కఠినమైన ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. 'బ్లాక్ ఫారెస్ట్... ట్రెక్కింగ్... ట్రైనింగ్... పునరుజ్జీవం.' అంటూ క్యాప్షన్ ఇవ్వగా... ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

రీసెంట్‌గా విదేశాల్లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేయగా... పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే భారీ సెట్స్ వేసి షూటింగ్ కంప్లీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర కోసం వేసిన సముద్రం సెట్లో కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి VFX వర్క్స్‌పై ఫోకస్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read : మ్యాచో స్టార్ గోపీచంద్, వెంకట్ మూవీ ప్రారంభం - మలయాళీ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ

ఇంటర్నేషనల్ లెవల్‌లో..

వివిధ ప్రాంతాలు, విభిన్న కాలాలతో సాగే సాహస అన్వేషకుడి ప్రయాణంగా వారణాసి రూపొందిస్తుండగా... ఇంటర్నేషనల్ స్థాయిలో మూవీని ప్రమోట్ చేస్తున్నారు జక్కన్న. రీసెంట్‌గా మెక్సికోలో కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ ఈవెంట్‌లో స్పెషల్ మేకింగ్ వీడియో ప్రదర్శించారు. గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్‌ను ఆకర్షించే లక్ష్యంతో రాజమౌళి సైతం స్పీచ్ వీడియో రిలీజ్ చేశారు.

త్వరలోనే హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రుద్రగా మహేశ్ బాబు, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్, శివ భక్తుడిగా ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?