ప్రాజెక్ట్ K ఇప్పుడు ఇండియాలో విపరీతంగా బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా. ప్రభాస్ కెరీర్ లోనే అంతెందుకు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే 500 కోట్ల పైచిలుకు బడ్జెట్ తీస్తున్న మొట్ట మొదటి సినిమా. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతీ బ్యానర్ నుంచి 50వ సినిమాగా వస్తున్న ‘ప్రాజెక్ట్ K’ నుంచి ఆ టీమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. సినిమాకు సంబంధించిన లీక్స్ నే ప్రమోషన్ క్యాంపెయిన్‌లా ‘స్క్రాచ్’ పేరుతో రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే ‘స్క్రాచ్’ ఎపిసోడ్ - 1 అని భారీ చక్రాన్ని తయారు చేయటానికి ఎంత కష్టపడ్డారో చూపించిన ప్రాజెక్ట్ K టీమ్.. ఇప్పుడు సినిమా కథలో ఓ లీక్ ఇచ్చింది. అదే రైడర్స్. అసలు ఎవరీ రైడర్స్? టీజర్ లో నాగ్ అశ్విన్ ఏం కన్వే చేశారు?
రైడర్స్ అంటే ఎవరు అంటే ఈ టీజర్ లో నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానం యూనిఫార్మ్డ్ ఆర్మీ ఆఫ్ ది విలన్. విలన్ స్పెషల్ సైన్యమే రైడర్స్. వాళ్లకు సంబంధించిన డ్రెస్ ఎలా ఉంటుంది. అసలు రైడర్స్ కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేయాలనేది నాగ్ అశ్విన్ అండ్ టీమ్ డీటైల్డ్ ప్లాన్ చేసుకున్నారు. వెరీ ఎక్స్పెన్సివ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం అని ప్రొడ్యూసర్ తో.. ప్రాక్టికల్లీ ఇంపాజిబుల్ అని మరొక టీమ్ మెంబర్ తో చెప్పించారు ఈ రైడర్స్ గురించి చెప్పినప్పుడు.
పోలండ్ కు చెందిన కాన్సెప్ట్ డిజైనర్ సెర్గీ గొలొటొవొస్కీ రైడర్స్ ఎలా ఉండాలి? వాళ్ల డ్రెస్ ఎలా ఉండాలి.. ఓ కాన్సెప్ట్ ను డిజైన్ చేసి ఇచ్చారు. ఇదిగో ఇలా ఉంటారు రైడర్స్. నాగ్ అశ్విన్ హింట్ ప్రకారం.. వీళ్లు విలన్ చెప్పిన పనులు చేసేవాళ్లని అర్థమవుతోంది. ‘ప్రాజెక్ట్ K’ నుంచి వచ్చిన పోస్టర్ లో ఉన్న ఈ మనుషులు.. ఈ రైడర్స్ ది ఒకటే డ్రెస్. అంటే వాళ్లే వీళ్లు అని అనుకోవచ్చు. మరి ఈ చేయి ఎవరిది. ఎందుకు చేయి ఒకటే ఉంద అనేది మాత్రం మిస్టరీ. పైగా ఈ రైడర్స్ డ్రెస్ మీద ఓ సింబల్ తో కాయిన్ ఉంది. చూడటానికి ఏలియన్ (గ్రహాంతరవాసి) లేదా మైథాలజీ టచ్ ఉన్న వింత ఆకారంలా రకరకాలుగా కనిపిస్తోంది ఆ గుర్తు. ఆ గుర్తు ఆధారంగా కొంత మంది ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఇవిగో ఈ కాయిన్స్ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. వీళ్లు పూర్వకాలంలో అంతరిక్షం నుంచి వచ్చినట్లు నమ్మే ఆస్ట్రోనాట్స్ లేదా ఏలియన్స్. సో ఈ రైడర్స్ ఆ ఏలియన్స్ ఆపరేట్ చేసేవాళ్లనేది నెంబర్ 1 పాయింట్.
మొన్నా మధ్య సినిమాలో హిందూపురాణాలు రిఫరెన్స్ ఉంటుందని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ చెప్పారు. సో హీరో ఏలియన్స్ పై పోరాడే దైవాంశ సంభూతుడా లేదా... ఈ ఓల్డ్ టెక్నాలజీ ఆస్ట్రోనాట్స్ కమ్ ఏలియన్స్ పవర్స్ ను ఎదుర్కొనే హై ఎండ్ టెక్నాలజీ మీద వర్క్ చేసే క్యాపబులిటీస్ ఉన్నవాడైనా అయ్యింటాడు. ప్రభాస్ బర్త్ డే రోజు ‘ప్రాజెక్ట్ K’ టీమ్ రిలీజ్ చేసిన ప్రభాస్ చేయి అలాంటి హైఎండ్ టెక్నాలజీకి సంబంధించే కదా. ఎండ్ ఇందాక చెప్పినట్లు ఎపిసోడ్ 1 చూపించిన వీల్ చివర్లో వినిపించిన సౌండ్ ప్రభాస్ వెహికల్ అనుకోవచ్చు. రైడర్స్ గురించి చెప్పిన వీడియోలో బోర్డ్ పైన హ్యూమనాయిడ్ అని రాసింది. అంటే మనిషి లాంటి రోబో. మన రజినీకాంత్ చిట్టీల్లా అన్నమాట. సో వీళ్లని ఆపరేట్ చేసే మనుషులెవరో ఉన్నారు. మొత్తంగా ఇది భూమితో పాటు అంతరిక్షానికి సంబంధం ఉన్న కథ అయ్యి ఉంటుంది లేదా ఫ్యూచర్ లో జరిగే ఏదో పాయింట్ మీద రన్ అయ్యే సినిమా అయ్యిుంటుంది. ఏం చేసినా ప్రభాస్ తో నాగ్ అశ్విన్ గ్రాండ్ లెవల్ లో మ్యాజిక్ చేయనున్నారనయితే అర్థం అవుతోంది. ఫ్యూచర్ లో మరిన్ని అప్ డేట్స్ వస్తాయి కాబట్టి.. కథ మీద ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘ప్రాజెక్ట్ K’ సినిమాను విడుదల చేస్తామని టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.
Also Read: ‘ప్రాజెక్ట్ కె’ నుంచి మరో అప్డేట్ - ‘రైడర్స్’ అంటే ఎవరో తెలుసా? ఈ వీడియో చూడండి