Ibrahim Ali Khan - Khushi Kapoor : ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ వారసులంతా యాక్టర్స్ అయిపోవడానికి రెడీ అవుతున్నారు. ఒకట్రెండు సంవత్సరాల్లో అందరూ వెండితెరపై డెబ్యూ ఇవ్వనున్నారు. ఇప్పటికే ‘ది ఆర్కైస్’ అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్‌తో ఓటీటీ డెబ్యూ ఇచ్చేశారు కొందరు వారసులు. అందులో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ కూడా ఉంది. ఇక ఓటీటీలో డెబ్యూ అయిపోయింది కాబట్టి తరువాతి వెండితెరపై అడుగుపెట్టడానికి ఖుషీ సిద్ధమవుతోందట. అంతే కాకుండా ఒక స్టార్ హీరో వారసుడితో ఖుషీ డెబ్యూ ఉండనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ కిడ్స్‌ను వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్.. వీరి డెబ్యూ బాధ్యతలు కూడా స్వీకరించాడు.


డెబ్యూ అవ్వకముందే రెండో సినిమాకు సిగ్నల్..
సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్.. ఇప్పటికే హీరోగా గ్రాండ్ డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో తన మొదటి సినిమా ‘సర్జామీన్’ షూటింగ్ జరుగుతోంది. థ్రిల్లర్ కథతో మొదటిసారి హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి ఇబ్రహీం సిద్ధమవుతున్నాడు. ‘సర్జామీన్’లో కాజోల్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్.. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంతలోనే ‘ది ఆర్కైస్’తో హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఖుషీ కపూర్‌తో ఇబ్రహీం రెండో సినిమా ఉండనుందని టాక్ మొదలయ్యింది. అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయినట్టు సమాచారం.


నేరుగా ఓటీటీకే..
‘ది ఆర్కైస్’తో ప్రేక్షకులను పలకరించిన ఖుషీ కపూర్.. ఇబ్రహీం అలీ ఖాన్ కంటే సీనియర్ అయిపోయింది. అయినా ఇబ్రహీం ‘సర్జామీన్’ విడుదలయ్యే వరకు ఎదురుచూసి తనతో పాటు తన రెండో సినిమాలో జోడీకట్టనుంది. దీంతో ఇబ్రహీం, ఖుషీ ఇద్దరికీ తమ కెరీర్‌లో ఇది రెండో ప్రాజెక్ట్ కానుంది. ‘ది ఆర్కైస్’లాగానే ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదలయ్యే విధంగా తెరకెక్కనుందని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నడిచే ధర్మాటిక్స్.. ఈ మూవీని నిర్మించనుంది. ఇంకా ప్రాజెక్ట్ మొదలవ్వక ముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌తో ధర్మాటిక్స్ చర్చలు మొదలుపెట్టిందని తెలుస్తోంది.


కథ సిద్ధం..
బాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ జోనర్‌కు ఉండే క్రేజే వేరు. అందుకే ఇబ్రహీం, ఖుషీ కపూర్‌ల కెరీర్‌లో రెండో సినిమాగా తెరకెక్కేది కూడా ఈ జోనర్‌కు చెందినదే అని సమాచారం. ఇప్పటికే దీనికి కావాల్సిన కథ సిద్ధంగా ఉండగా.. ఇది వెండితెరపైకంటే నేరుగా ఓటీటీలో విడుదల అవ్వడానికే ఎక్కువగా సూట్ అవుతుందని కరణ్ జోహార్ భావించాడట. అందుకే ఒక ఓటీటీ ఒరిజినల్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ జోహార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన షౌనా గౌతమ్.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. షౌనా.. రాజ్‌కుమారీ హిరానీ వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తాజాగా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’కి కూడా షౌనా ఏడీగా అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయగా.. అదే సినిమాకు ఇబ్రహీం అలీ ఖాన్.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.


Also Read: ఒక్క ఛాన్స్ ప్లీజ్ - ‘కాంతార - చాప్టర్ 1’ కోసం రిషబ్ శెట్టికి పాయల్ రాజ్‌పుత్ ఓపెన్ రిక్వెస్ట్