Case Filed on Singer Chinmayi: స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద చిక్కుల్లో పడింది. ఆమెపై హైదరాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతదేశంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ విద్యార్థి చిన్మయిపై గచ్చిబౌలి పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన కుమార్ సాగర్ (28) గత ఫిబ్రవరి నెల 27వ తేదీన చిన్మయిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో సీనియర్ నటి అన్నపూర్ణ ఆడవాళ్లపై చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇస్తూ చిన్మయి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
ఈ సందర్భంగా ఆమె భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వీడియో చూసిన కుమార్ సాగర్ ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆమెపై చట్టపరమైన చర్యలు దిగారు. ఈ మేరకు చిన్మయిపై హైదరాబాద్ నగరం గచ్చిబౌలి పోలీసుల స్టేషన్ ఫిర్యాదు చేశాడు. చిన్మయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారని, ఈ సందర్భంగా భారతదేశంను ఆమె కించపరిచేలా మాట్లాడారని సదరు విద్యార్థి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. "సీనియర్ నటి అన్నపూర్ణ గారికి ఎన్‌కౌంటర్‌గా గాయని చిన్మయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అప్‌లోడ్ చేశారు. ఇందులో ఆమె.. భారతదేశంలో పుట్టడం మన కర్మ, అలాగే భారతదేశం వంటి స్టుపిడ్ దేశంలో(చెత్త దేశం) మనం ఎందుకు పుట్టాలి అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఉంటూ, భారత దేశం సౌకర్యాలను పొందుతూ.. భారతదేశం గాలిని పిల్చి ఈ దేశపు తిండి తింటూ.. భారతదేశంలో పుట్టడం కర్మ, భారతదేశాన్ని స్టుపిడిటి దేశం అనడం సరికాదు.
చిన్మయి వ్యాఖ్యలు బాధించాయి
ఒక భారతదేశ పౌరుడిగా, బాధ్యత గల విద్యార్థిగా సింగర్ చిన్మయి వ్యాఖ్యలు నన్ను బాధించాయి. నా దేశం పట్ల అమమానీయ వ్యాఖ్యలు చేసిన ఆమెపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నా దేశ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడలని కోరుతున్న" అంటూ అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన సీనియర్ నటి అన్నపూర్ణ ఆడవాళ్లపై జరుగుతున్న అఘాత్యాలపై స్పందించారు. ఆడవాళ్ల తీరు, ఎక్స్‌పోజింగ్ వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, టైం పాడు లేకుండ అర్థరాత్రిలు బయట తిరుగుతున్నారని.. అంత రాత్రి వారికి ఏం పని అంటూ ఆమె మండిపడ్డారు. ఏమన్నా అంటే స్వతంత్ర్యం లేదా అంటారు. అసలు ఆడవాళ్లకు స్వతంత్ర్యం ఎందుకు? అంటూ అన్నపూర్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్స్‌పై వ్యతిరేకిస్తూ సింగర్ చిన్మయి కౌంటర్‌గా వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే ఆమెను చిక్కుల్లో పడేసింది.
Also Read: 'కల్కి'లో టాలీవుడ్ లెజెండరీ నటుడు! - ప్రభాస్‌తో ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ..