Hreem Telugu Movie To Release Soon : ఇప్పటివరకూ ఎక్కడా చెప్పని ఎవరికీ తెలియని ఓ రియల్ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ మూవీ 'హ్రీం'. తెలుగు భీజాక్షరాల్లో 'హ్రీం' అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ఈ ఒక్క  భీజాక్షరంలోనే 'హ', 'ర', 'ఈ', 'మ' అనే అక్షరాలున్నాయి. 'హ' అంటే ధర్మం, 'ర' అంటే అర్థం, 'ఈ' అంటే కామం, 'మ' అంటే మోక్షం.. 'హ్రీం' అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం. 

'హ్రీం' మూవీలో నూతన నటీనటులు పవన్ తాత, డాక్టర్ చమిందా వర్మ జంటగా నటించారు. వీరితో పాటే ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్‌ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాజేష్ రావూరి దర్శకత్వం వహించగా... సుజాత సమర్పణలో శివమ్ మీడియా బ్యానర్‌పై శివమల్లాల నిర్మించారు.

షూటింగ్ కంప్లీట్

వరంగల్‌ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్‌ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది ఈ చిత్రం. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.

Also Read : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'హ్రీం' టెక్నికల్ టీం - స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రావూరి రాజేష్, నిర్మాత – శివ మల్లాల, కెమెరా –  అరవింద్, సంగీతం – మార్కస్‌.యం ఎడిటింగ్‌ – డిఐ – వైఎస్‌ఎస్‌ శివప్రకాశ్‌ ఆర్ట్‌ - సుధీర్‌ మాచర్ల ‘క’ ఫేమ్‌ వీ.ఎఫ్‌.ఎక్స్‌ డైరెక్టర్‌ – రాజ్‌ పవన్‌ కొమ్మోజు, పి.ఆర్‌.వో– మూర్తి మల్లాల.