Varun Sandesh's Constable Movie OTT Release Date Lokced : యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్'. గతేడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దాదాపు 3 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్' సొంతం చేసుకోగా గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 'యూనిఫాం బాధ్యత మోస్తుంది. హృదయం ధైర్యం కలిగి ఉంటుంది. సత్యాన్ని వేటాడి న్యాయం సాధించే వరుణుడి తీవ్రమైన ప్రపంచంలోకి అడుగుపెట్టండి.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఆర్యన్ సుభాస్ ఎస్కే దర్శకత్వం వహించిన ఈ మూవీలో వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే దువ్వాసి మోహన్, బలగం జగదీష్, రవివర్మ, సూర్య, ప్రభావతి, కల్పలత, మురళీ ధర్ గౌడ్, నిత్యశ్రీ, శ్రీభవ్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మించారు. 

Also Read : ప్రభాస్ 'ది రాజా సాబ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్? - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కాబోతున్న డార్లింగ్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్!

స్టోరీ ఏంటంటే?

మోకిల మండల శంకర్పల్లి గ్రామం చుట్టూ జరిగే స్టోరీ ఇది. ఆ గ్రామంలో ఆడ, మగ అనే తేడా లేకుండా వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఒంటరిగా ఉండే టైంలో టార్గెట్ చేసి మరీ గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేస్తుంటారు. ఈ సీరియల్ కిల్లింగ్స్ పోలీసు శాఖకు సవాల్‌గా మారుతుంటాయి. అదే ఊరిలో కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు కాశీ (వరుణ్ సందేశ్). అతని మేనకోడలు కీర్తి (నిత్య శ్రీ) కూడా బలి అవుతుంది.

దీంతో కాశీయే స్వయంగా కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు రెడీ అవుతాడు. ఎవరిని అనుమానించినా చివరకు వారే చనిపోతుంటారు. అసలు ఊరిలో సీరియల్ కిల్లింగ్స్‌కు కారణమెవరు? ఎందుకు ఈ హత్యలు చేస్తున్నారు? కిల్లర్స్‌ను కాశీ పట్టుకున్నాడా? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.