How Much Khan's Charge For Ambani Pre Wedding Event: గత కొద్ది రోజులు సోషల్‌ మీడియా మొత్తం అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ ఫొటోలు, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, మాజీ ప్రధానులు, దిగ్గజ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. అలాగు గ్లోబల్‌ పాప్‌ సెన్సేషన్‌ రిహాన్నే స్పెషల్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చింది. ఇక బాలీవుడ్‌ మొత్తం అంబానీ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌లోనే కనిపించింది.  మూడు రోజుల పాటు ఈ వెంట్‌లో ఆడిపాడారు. ముఖ్యంగా ముగ్గురు ఖాన్‌లను ఒకచోట చూసి ఫ్యాన్స్‌ అంతా మురిసిపోయారు. చివరి రోజు అయితే ముగ్గురు స్టేజ్‌పై నాటు నాటు పాటకు స్టెప్‌లు వేశారు. అయితే ఇందుకోసం అంబానీ ఖాన్‌లకు డబ్బు చెల్లించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


అంబానీ ఖాన్ లకు ఎంతించారంటే..


అయితే ఆ ముగ్గురు ఇచ్చిన మొత్తం కూడా రిహాన్నేకు ఇచ్చినంత కూడా కాదంటూ బి-టౌన్‌లో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కూడా ఇదే విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్‌ చేసింది. మామూలుగా సెలబ్రిటీలు ఏదీ ఊరికే చేయరు. ఇంటర్య్వూ కావాలన్న వారికి ఎంతోకొంత ఇవ్వాల్సిందే. అలాంటిది స్పెషల్‌ ఈవెంట్స్‌లో పర్ఫామెన్స్‌ అంటే ఖచ్చితంగా భారీగా ముట్టజెప్పాల్సిందే. అదే అంబానీ వంటి కుబేరుడి ఇంటి వేడుక అంటే అక్కడ సెలబ్రిటీలతో హంగుఆర్భాట్లు ఉండాల్సిందే. అందుకే ఎలాంటి కార్యక్రమం అయినా బాలీవుడ్‌ సెలబ్రిటీలకు స్పెషల్‌ ఇన్వీటేసన్‌ ఉంటుంది.


ఇందుకోసం బాలీవుడ్‌ వాళ్లు జస్ట్ అలా హాజరయ్యేందుకు కూడా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుంటారట. ఇక ఖాన్‌లు కూడా కోట్ల రూపాయలు తీసుకునే అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌లో ఆడిపాడారట. ఇందుకోసం ముగ్గురు ఖాన్‌లకు చెల్లించిన మొత్తం కూడా పాప్ సింగర్‌ రిహాన్నే అమౌంట్‌ని చేరుకోలేకపోయాయంటూ బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అంటే ఓ పాప్‌ సింగర్‌ దక్కిన గౌరవం బాలీవుడ్‌ ఖాన్‌లకు అంబానీ ఇవ్వలేదంటూ అంతా వారిని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే రిహాన్నేకు అంబానీ దాదాపు రూ. 54 కోట్ల నుంచి రూ. 63 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఖాన్‌పై వస్తున్న ఈ వార్తలను పలువురు కొట్టిపారేస్తున్నారు. ఓ బాలీవుడ్‌ మీడియా కథనం ప్రకారం ప్రీవెడ్డింగ్‌ వెల్లిన ఏ బాలీవుడ్ సెలబ్రిటీ కూడా డబ్బులు తీసుకోలేదని, నిజానికి అలాంటి ఏం ఉండదన్నారు.



కంగనా షాకింగ్ పోస్ట్


అంబానీ ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతోనే బాలీవుడ్‌ ప్రీవెడ్డింగ్‌లో సందడి చేశారంటున్నారు. మరోవైపు కంగనా కూడా ఇదే అంశంపై పోస్ట్‌ షేర్‌ చేసింది. డబ్బుల ఆశ పడే కొందరు బడా వ్యాపారవేత్త ఇంటి ఫంక్షన్స్‌కు వెళతారని, గతంలో తనకు కూడా అలాంటి ఆహ్వానం వచ్చినా తాను వెళ్లలేదని చెప్పింది. నేను ఆర్థికపరంగా ఘోరమైన పరిస్థితులు చూశాను. కానీ, ఎప్పుడు నేను ఏనాడు పెళ్లిళ్లలో డ్యాన్స్‌లు పాటలు పాడలేదు. గతంలో సింగర్స్ ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ లాంటి వాళ్లకు కూడా తమ పెళ్లిలో పాటలు పాడితే రూ.50 కోట్లకు అంతకు మించి ఇస్తామని ఆశ చూపారట. కానీ వాళ్లు వెళ్లలేదు. కానీ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‪‌లో మాత్రం బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. వీళ్లు.. పెళ్లికి హాజరవడంతో పాటు డ్యాన్సులు చేసినందుకు గానూ ఒక్కో సినిమాకు అయ్యేంత రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం. అందుకే అంబానీకి ప్రీ వెడ్డింగ్‌కే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అయిందంటున్నారు.