'సూర్యవన్షీ' తర్వాత బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేశారు. మధ్యలో హారర్ కామెడీ 'స్త్రీ 2'లో అతిథి పాత్రలో సందడి చేశారు. 'సింగం ఎగైన్'లో సూర్యవన్షీగా కనిపించారు. ఇటీవల 'కేసరి 2'తో విజయం అందుకున్న అక్షయ్... ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా 'హౌస్‌ఫుల్ 5'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏమిటో తెలుసా?
సినిమా ఒక్కటే కానీ...క్లైమాక్స్‌లు డిఫరెంట్!'హౌస్‌ఫుల్ 5'లో అక్షయ్ కుమార్‌తో పాటు అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా నటించారు. సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పడే కీలక పాత్రలు చేశారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కమ్ ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.
సినిమాకు ఒక్క క్లైమాక్స్ షూట్ చేయలేదట. డిఫరెంట్ డిఫరెంట్ క్లైమాక్స్‌లు తీశారట. ''ఒక థియేటర్‌లో మీరు సినిమా చూసినప్పుడు ఒక క్లైమాక్స్ ఉంటే మరొక థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే ఇంకొక క్లైమాక్స్ ఉంటుంది'' అని సాజిద్ నదియాడ్‌వాలా తెలిపారు. పివిఆర్, ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్స్‌లకు వెళితే... పక్క పక్క స్క్రీన్‌లలో డిఫరెంట్ క్లైమాక్స్‌లు ఉంటాయని ఆయన వివరించారు. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంటే ఒక్కసారి సినిమా చూసిన ప్రేక్షకుడు ఇంకోసారి థియేటర్‌కు రావడానికి ఈ విధమైన ప్రయోగం చేశారని అనుకోవాలి.
Also Read: పవన్ కళ్యాణ్ విలన్‌కు డెంగ్యూ... ముంబైలో ఆగిన 'ఓజీ' షూటింగ్
చార్లీ చాప్లిన్ స్ఫూర్తి...కామెడీ చేయడం కష్టమని చాలా మంది ఆర్టిస్టులు చెప్పే విషయం. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఫిజికల్ కామెడీ చేయడం కష్టమని చెప్పారు. ఈ సినిమా చేసేటప్పుడు చార్లీ చాప్లిన్ స్ఫూర్తితో చేశానని ఆయన అన్నారు. తాను చార్లీ చాప్లిన్ అభిమాని అని, ఈ సినిమా చేసేటప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకుని చేస్తానని వివరించారు. జూన్ 6వ తేదీన సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.