Hero Siddharth Fire on Media: హీరో సిద్ధార్థ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు, సింగర్‌, నిర్మాత‌గా ఇలా మల్టీటాలెంట్‌తో దక్షిణాదిన మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయిన ఫన్‌, ఎమోషన్‌ పండించి తనదైన యాక్టింగ్‌ స్కిల్‌తో ఆకట్టుకుంటాడు. వైవిధ్యమైన జానర్లు, ప్రేమకథ చిత్రాలతో మెప్పించిన సిద్ధార్థ్‌ నిజ జీవితంలో చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. పర్సనల్‌ లైఫ్‌ విషయంలో చాలా గొప్యత పాటిస్తుంటాడు. ఇక మీడియాతో ఇంటారాక్షన్‌ చాలా తక్కువ.


అంతేకాదు తన తీరుతో తరచూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఎలాంటి విషయంపై అయినా నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. తెరపై చాలా ఫ్రెండ్లీ క్యారెక్టర్‌ చేసిన సిద్ధార్థ్‌ బయటకు దానికి భిన్నమనే చెప్పాలి. చెప్పాలంటే అతడికి యాటిట్యూడ్‌ ఎక్కువ అని చెబుతుంటారు. తాజాగా అదే యూటిట్యూడ్‌తో సిద్ధార్థ్‌ వార్తల్లో నిలిచాడు.  త్వరలోనే అదితితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సిద్ధార్థ్‌ రీసెంట్‌గా ముంబైలోని బాంద్రాలో సందడి చేశాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా అతడిని ఫోటో తీసేందుకు ప్రయత్నించాయి.  ఫోటోకి ఫోజులు ఇవ్వాలని అడగ్గా సిద్ధార్థ్‌ వారిపై అసహనం వ్యక్తం చేశాడు.


Siddharth Loses Cool At Paps Video Viral: మీడియా వ్యక్తి సర్‌ సర్‌ అంటూ సిద్ధార్థ్‌ వెంటపడ్డాడు."అలా సౌండ్‌ చేయకు బాస్‌. నాకు నచ్చదు. నీకు చెప్పాను కదా" అంటూ ఫ్యాన్‌పై అసహనం చూపించాడు. ఇక సిద్ధార్థ్‌ అలా అనడంతో ఆ వ్యక్తి క్షమాపణ అడగ్గా.. థ్యాంక్యూ అంటూ సిద్ధార్థ్‌ కారెక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి అంతా 'సిద్ధార్థ్‌కు ఎంత పోగరు','సెల్పీ అడిగితే ఇంతా కోపమా?'‌ అంటూ సిద్ధార్థ్‌పై మండిపడుతున్నారు. ఇలా సిద్ధార్థ్‌ చేయడం మొదటి సారి కాదు. గతంలో తన యాటిట్యూడ్‌ వల్ల ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు. ఇక ఎప్పుడైన మీడియా కంటపడ్డ.. వారిని అవైయిడ్‌ చేసి వెళ్లిపోతుంటాడు. 






ఇక ఈ మధ్య సిద్ధార్థ్‌ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న సిద్దార్థ్‌ చివరిగా చిన్నా అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సిద్ధార్థ్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పెళ్లి విడాకులు తర్వాత సింగిల్‌గా ఉంటున్న సిద్ధార్థ్‌  ఇక త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. కొంతకాలంగా హీరోయిన్‌ అదితి రావు హైదరితో సీక్రెట్‌ రిలేషన్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల సీక్రెట్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట ఈ ఏడాది చివరిలో లేదు నెక్ట్స్‌ ఇయర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.  


Also Read: కల్కి మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ - ఇందులో కాశీ నగరం ప్రత్యేకం, ఎందుకంటే..