ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నగే హనుమంతుడిగా నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను కనబరిచింది. అటు విమర్శకుల నుండి కూడా ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కమర్షియల్ గా భారీ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా మొదటి వీకెండ్ సుమారు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో సుమారు మూడు దశాబ్దాలుగా మంచి స్టార్ డంను అందుకున్న ఈ హీరో అదిపురుష్ తో ఒక రకంగా తెలుగు వెండితెరకి ఆరంగేట్రం చేశాడని చెప్పాలి.


అయితే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రను పోషించినందుకు గాను సుమారు రూ.12 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో అత్యధిక పారితోషకం తీసుకున్న నటుల్లో ఒకరిగా నిలిచారు సైఫ్ అలీ ఖాన్. ఇక ఇందులో బాహుబలి హీరో ప్రభాస్ టాప్ పొజిషన్లో ఉన్నాడనే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం 'ఆదిపురుష్' సినిమా కోసం ప్రభాస్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాఘవ, అతని తండ్రి దశరథ్ గా ద్విపాత్రాభినయం చేసినందుకు ప్రభాస్ సుమారు రూ.100 నుంచి రూ.150 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఆదిపురుష్ లో నటించిన నటీనటుల్లో ప్రభాస్ సైఫ్, అలీ ఖాన్ ఇద్దరే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన లంకేష్ పాత్ర పైనే ఆడియన్స్ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.


దీంతో సైఫ్ అలీ ఖాన్ కి ఆదిపురుష్తో టాలీవుడ్ లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ కాగా ఆదిపురుష్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో మరో భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా పేరే 'దేవర'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలోని సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. అంతేకాదు రీసెంట్ గానే  మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. సినిమాలో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలను కొరటాల శివ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారట. సైఫ్ అలీ ఖాన్ పాత్రని చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు.


Also Read: పడిపోయిన 'ఆదిపురుష్' కలెక్షన్స్ - ఒక్క రోజులో మరీ అంత తక్కువా?