రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అనే ఒక కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కోలుకోలేని ఫ్లాప్‌లు అందుకున్న సమంత, విజయ్ దేవరకొండ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకుల్లో పాజిటీవ్ వైబ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక మేజర్ అప్డేట్‌ను అందించారు మేకర్స్. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.
క్యూట్ పెయిర్ అంటూ కామెంట్స్..
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా ప్రారంభమయినప్పటి నుండి ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. పైగా ఈ మూవీ నుండి విడుదలయ్యే ప్రతీ పోస్టర్, గ్లింప్స్, సాంగ్స్‌లో విజయ్, సమంత పెయిర్ చాలా క్యూట్‌గా అనిపిస్తోంది. దీంతో లవ్ స్టోరీలను ఇష్టపడేవారు ‘ఖుషి’ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చూస్తున్నారు. ప్రేమకథలను మరింత అందంగా తెరకెక్కించే శివ నిర్వాణ.. విజయ్, సమంత పెయిర్‌ను ఇంకెంత అందంగా చూపించి ఉంటాడో అని అప్పుడే ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు కూడా.
ట్రైలర్ నిడివి కూడా చెప్పేశారు..
తాజాగా ‘ఖుషి’ట్రైలర్ ఆగస్ట్ 9న విడుదల కానుందని మూవీ టీమ్‌తో పాటు సమంత, విజయ్ దేవరకొండ కూడా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకండ్లు ఉంటుందని కూడా రివీల్ చేశారు. ట్రైలర్ గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వడం కోసం విజయ్, సమంత కలిసున్న ఒక క్యూట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ‘ఖుషి’ నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. ఈ మూడు మంచి మెలోడీస్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ లవర్స్ అయితే ఈ సాంగ్స్‌ను లూప్‌లో వింటున్నారు. ఇప్పటివరకు ‘ఖుషి’ నుండి విడుదలయిన ఏ ఒక్క అప్డేట్‌కు కూడా నెగిటివ్ రివ్యూ రాలేదు. పైగా సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పుడు అసలు విజయ్, సమంత పెయిర్ ఎలా ఉంటుందో అని విమర్శించిన వారు కూడా ఇప్పుడు వారిని చూడడానికి రెండు కళ్లు చాలడం లేదని ప్రశంసిస్తున్నారు.
సెప్టెంబర్ 1న ‘ఖుషి’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయ్, సమంత కలిసి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’లో పెయిర్‌గా నటించినా.. అందులో వీరి కెమిస్ట్రీని పండించే అవకాశం మాత్రం రాలేదు. కానీ ‘ఖుషి’లో మాత్రం వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుండదనుందని ఇప్పటికే ప్రేక్షకులకు అర్థమయ్యింది. ‘ఖుషి’ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి సమంత సినిమాలో నటించడం లేదని, ‘ఖుషి’ని పక్కన పెట్టేసిందని అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ మూవీ టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు ‘ఖుషి’ మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ.. అందరికీ గట్టి సమాధానమే ఇచ్చారు. అంతే కాకుండా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మూవీ షూటింగ్‌ను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకురానున్నారు.
Also Read: చిన్మయి కవల పిల్లలతో సమంత ఆట పాటలు - వీడియో వైరల్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial