Eagle 3 Days Box Office Collections: మాస్ మహారాజా రవితేజ.. చాలాకాలం తర్వాత ‘ఈగల్’తో కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఫిబ్రవరీ 9న విడుదలయిన ఈ చిత్రం మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్ నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. పలు ప్రాంతాల్లో ‘ఈగల్’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం పరవాలదేనిపిస్తోంది. ఫస్ట్ డే లాగానే రెండోరోజు, మూడోరోజు కలెక్షన్స్ కూడా సాగుతుండడంతో మెల్లగా మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటే బాగుంటుందని రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


మూడురోజుల్లో ఎంతంటే..?


మొదటిరోజు ‘ఈగల్’.. దేశవ్యాప్తంగా రూ. 6.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండోరోజు దాదాపు రూ.5 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో రెండురోజుల్లోనే ‘ఈగల్’ కలెక్షన్స్.. రూ.10 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. మొదటిరోజులాగానే రెండోరోజు కూడా ఈ సినిమా బాగా హెల్డ్ చేయడంతో వసూళ్లు నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మూడో రోజు కలెక్షన్స్ మాత్రం కాస్త తగ్గాయి. మూడోరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘ఈగల్’.. రూ. 3 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మూడోరోజు ‘ఈగల్’ కలెక్షన్స్ రూ.3.40 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. విడదలయిన మూడు రోజుల్లో ‘ఈగల్’.. రూ.11.50 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది.


హిందీలో కూడా పరవాలేదు..


సినిమాటోగ్రాఫర్‌గా సూపర్ సక్సెస్‌ఫుల్ అయిన కార్తిక్ ఘట్టమనేని రవితేజలాంటి మాస్ హీరోతో ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఈగల్’ మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల అవ్వగా.. అక్కడ రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను కూడా ఏర్పాటు చేసింది. తమ సినిమాను హిట్ చేసినందుకు ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నారు మేకర్స్. మెల్లగా సినిమా బ్రేక్ ఈవెన్ సాధించుతుందని వారు ధీమాతో ఉన్నారు.


పక్కా ప్లానింగ్‌తో..


‘ఈగల్’లో రవితేజకు జోడీగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల వంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ద్వారా కార్తిక్ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుండి డైరెక్టర్‌గా మారాడు కార్తిక్. కానీ ఆ సినిమా.. తనకు ఆశించినంత విజయాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయింది. అందుకే డైరెక్షన్‌కు గ్యాప్ ఇచ్చాడు. పక్కా కథతో, ప్రిపరేషన్‌తో ఈసారి ‘ఈగల్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి మాత్రం కార్తిక్ టేకింగ్‌కు చాలామంది ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.


Also Read: ‘హనుమాన్’ కంటే ‘శ్రీ ఆంజనేయం’ బాగుంది - స్పందించిన దర్శకుడు కృష్ణవంశీ