Justice Hema Committee Report: మలయాళ ఇండస్ట్రీలో నటిమణులపై లైంగిక వేధింపులపై కేరళ ప్రభుత్వం మాజీ జస్టిస్‌ హేమ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీలో సీనియర్‌ నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో నటి భావన కేసులో వేసిన ఈ కమిటీ ఇటీవల సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించగా.. రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మాలీవుడ్‌లో నటీమణులపై లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఈ కమిటీ తేల్చేసింది.


అంతేకాదు ఎంతోమంది నటీమణుల వాగ్మూలనాన్ని స్వయంగా తీసుకుంది. మొత్తం 230పైగా పేజీల నివేదికలో 55 - 56 పేజీల్లో నటీమణులు స్వయంగా లైంగిక వేధింపులను అంగీకరించినట్టుగా ప్రస్తావించారు. అంతేకాదు ఇండస్ట్రీలో మహిళ నటులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై క్లుప్తంగా వివరణ ఇచ్చారు. ఇక్కడ అవకాశాలు రావాలంటే నటీమణులు సర్దుకుపోవాల్సిందేనన్నారు. ప్రముఖ నటీమణులు సైతం లైంగిక వేధింపులకు గురైనట్టు స్వయంగా వాంగ్మూలం ఇచ్చారని హేమ కమిటీ నివేదికలో పేర్కొనడం సంచలనంగా మారింది.


ఇక్కడ వారు చెప్పినట్టు విననని వారికి ఆఫర్స్‌ ఉండవని, ఒకవేళ ఆఫర్స్‌ ఉన్న వారిపై ఏదోక ముద్ర వేసి సినిమా నుంచి తొలగిస్తారని నివేదికలో చెప్పారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువ అని, సినిమాలో చాన్స్ రావాలంటే నటీమణుల సర్దుకుపోవాల్సి వాతావరణం ఉందని చెప్పారు. వేధింపులకు గురైన వారు ఆ విషయాన్ని బయటపెడితే వారికి ఇండస్ట్రలో చోటు ఉండదని, లేదంటే కుటుంబంతో సహా అందరిని బెదిరిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. మాలీవుడ్‌ను ఓ మాఫీయా గ్యాంగ్‌ కంట్రోల్‌ చేస్తుందని, ఇదోక 'పవర్ నెక్సస్' అని కమిటీలో నివేదికలో పేర్కొంది. నటీమణులు తమకు లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రాణభయంతో వారంత బయటకు రావడం లేదని తలిపింది.


అలాగే తనని లైంగికంగా వేధించిన ఓ హీరో కావాలనే హగ్‌‌ సీన్ కోసం 17 టేకులు తీసుకుని లైంగిక కోరిక తీర్చుకున్నాడు.  అతడు అన్నిసార్లు రీటేక్స్ తీసుకున్న డైరెక్టర్‌ ఏం అనకపోవడం తనని షాక్‌కు గురిచేసినట్టు స్వయంగా ఆ నటి ఇచ్చిన వాగ్మూలానాన్ని హేమ కమిటీ నివేదికలో నమోదు చేసింది. ఆ హీరో కావాలనే అన్నిసార్లు టేక్‌లు తీసుకుని తన కోరిక తీర్చుకున్నాడంటూ ఆ నటి పేర్కొన్నట్టు చెప్పారు. ఇక్కడ లైంగికంగా లొంగిపోయిన వారికే మంచి ఆహారం, సదుపాయాలు లభిస్తాయని.. మిగతా వాళ్లను అసలు పట్టించుకోరని చెప్పినట్టు నివేదికలో పేర్కొన్నారు.



అంతేకాదు లైంగికంగా లొంగని వారికి ఇక్కడ బెదిరింపులు కూడా ఉన్నాయని, ఫ్యామిలీని మెంబర్స్‌ని కూడా బెదిరిస్తున్నట్టు ఈ నివేదికలో వెల్లడించారు. ఆ ప్రాణభయంతోనే చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని, ఫిర్యాదు చేస్తే కుటుంబానికి బెదిరింపులు వస్తాయని భయపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు నగ్నంగా నటించాలనీ నటీమణులకు పై నుంచి ఒత్తిడి కూడా ఉందని, దర్శకులు-నిర్మాతలు అలా నటించమని ఒత్తిడి చేస్తున్నట్టు పలువురు నటీమణులు నుంచి తీసుకున్న వాగ్మూలనం కూడా హేమ కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం మాలీవుడ్‌పై హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. 



Also Read: మలయాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు - వెలుగులోకి సంచలన విషయాలు, హేమ కమిటీ ఏం చెబుతుందంటే!