తెలుగు చిత్రసీమలో అభిమానుల మధ్య ఒక విధమైన ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయ్యాయి. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. విడుదలకు ముందు ఇంటర్వ్యూల్లో ఆ సినిమా పుణ్యమా అంటూ వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రపంచానికి తెలిసింది. అభిమానులు మాత్రం స్నేహంగా ఉండటం లేదు.
 
జేమ్స్ కామెరూన్ సినిమాను అప్రిషియేట్ చేసినా, స్టీవెన్ స్పీల్‌బర్గ్ 'నాటు నాటు...' నచ్చిందని చెప్పినా తమ హీరోను పొగిడారంటే తమ హీరోని పొగిడారని, తమ హీరో వల్ల సినిమా హిట్ అయ్యిందంటే తమ హీరో వల్ల సినిమా హిట్ అయ్యిందని వార్ మొదలు పెడుతున్నారు. లేటెస్టుగా హెచ్‌సీఏ అవార్డ్స్ ప్రోగ్రామ్ సైతం సోషల్ మీడియాలో ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకోవడానికి కారణమైంది.
 
ఎన్టీఆర్‌ను పిలిచాం కానీ...
'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' పురస్కారాల కార్యక్రమానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ అటెండ్ అయ్యారు. బెస్ట్ వాయిస్ లేదా మోషన్ క్యాప్చర్ అవార్డును రామ్ చరణ్ ప్రజెంట్ చేశారు. అతని కో ప్రజెంటర్ అయితే రామ్ చరణ్ పక్కన నిలబడటమే తనకు అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అన్నట్లు మాట్లాడింది. ఆ అవార్డుల్లో రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి ఎన్టీఆర్ వెళ్ళకపోవడంతో చరణ్ హైలైట్ అయ్యారు. 


నందమూరి తారక రత్న మరణంతో 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్ వెళ్ళలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు, ప్రజలకు తెలిసిన విషయమే. అయితే, సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు కొంత మంది మధ్య వార్ మొదలైంది. రామ్ చరణ్ ఒక్కడిని పిలవడం వెనుక ఏదో ఉందని గుసగుసలు వినిపించాయి. వీటికి హెచ్.సి.ఎ చెక్ పెట్టింది. ఎన్టీఆర్‌ను తాము ఇన్వైట్ చేశామని పేర్కొంది. 


''డియర్ 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ & సపోర్టర్స్... మేం ఎన్టీ రామారావు జూనియర్ (NT Rama Rao Jr)ను పిలిచాం. ఇండియాలో కొత్త సినిమా షూటింగ్ కారణంగా రాలేకపోయారు. అతి త్వరలో మేం అతనికి అవార్డు అందజేస్తాం. మీ ప్రేమ, అభిమానానికి థాంక్యూ'' అని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.


Also Read : అగ్ని ప్రమాదానికి గురైన మెగాస్టార్ మూవీ సెట్ - దాని కాస్ట్ ఎంతంటే?






''వారం క్రితం ఎన్టీఆర్ తన సోదరుడిని కోల్పోయారు. వ్యక్తిగత జీవితంలో జరిగిన ఘటన వల్ల రాలేదు. మూవీ షూటింగ్ కాదు'' అని ఓ నెటిజన్ రిప్లై ఇవ్వగా... ''నిజానికి షూటింగ్ ఉండటం వల్ల రావడం కుదరదని చెప్పారు. ఆ తర్వాత సోదరుడి మరణం సంభవించడంతో సినిమా షూటింగ్ కూడా చేయలేదని ఎన్టీఆర్ ప్రతినిథులు మాతో చెప్పారు'' అని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బదులు ఇచ్చింది.


Also Read అక్షయ్ కుమార్ పరువు తీసిన 'సెల్ఫీ' - పదేళ్ళలో వరస్ట్ ఓపెనింగ్! 






'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డుల్లో (HCA Awards 2023) మన 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్స్ 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'ది విమెన్ కింగ్', 'టాప్ గన్ మేవరిక్' సినిమాలను వెనక్కి నెట్టి మరీ బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీల్లో 'ఆర్ఆర్ఆర్' (RRR Movie Awards HCA) విజేతగా నిలిచింది. ఇంకా ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిల్మ్, 'నాటు నాటు...'కు బెస్ట్ సాంగ్ వచ్చాయి. గత ఏడాది 'ఆర్ఆర్ఆర్' కాస్ట్ & క్రూ ప్రతిభ మెచ్చి స్పాట్ లైట్ అవార్డు కూడా అనౌన్స్ చేసింది. హీరో రామ్ చరణ్ కు స్పాట్ లైట్ అవార్డు అందజేశారు.