Director Jyothi Krishna About Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా మచిలీపట్నంలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించగా.. డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌పై జ్యోతికృష్ణ ప్రశంసలు కురిపించారు. ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మరిచిపోలేనని అన్నారు.

'హరిహర వీరమల్లు' మూడుసార్లు చూశారు

పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ మూడుసార్లు చూశారని చెప్పారు జ్యోతికృష్ణ. 'ఈ సినిమా చూసిన పవన్ సార్ నన్ను అప్రిషియేట్ చేశారు. నాతో ఇంకో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. మూడుసార్లు మూవీ చూసి గంటసేపు నన్ను మెచ్చుకున్నారు. 'అసురన్' సాంగ్ ఆయనకు చాలా ఇష్టం. దాదాపు 500 సార్లు ఆ పాట ఆయన విన్నారు.' అని తెలిపారు.

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..

మచిలీపట్నం బందరు పోర్టుకు సంబంధించి మూవీలో ఓ స్పెషల్ సీక్వెన్స్ ఉన్నట్లు చెప్పారు జ్యోతికృష్ణ. '17 శతాబ్దంలో పోర్టు ఉండేలా కనిపించేందుకు సీజీలో రెండేళ్లు కష్టపడ్డాం. ఈ సీక్వెన్స్‌లో తెల్ల దొరలు మనల్ని దోచుకుంటుంటే హరిహర వీరమల్లు దాన్ని ఎదుర్కొంటారు. దీని కోసం పవన్ సార్ చాలా కష్టపడ్డారు. అవుట్ పుట్ మీరు థియేటర్స్‌లో చూస్తే దద్దరిల్లాల్సిందే. మొన్న ఏపీ డిప్యూటీ సీఎంగా 'సీజ్ ద షిప్' అని అన్నారు. ఈ సీక్వెన్స్‌లో తెల్లవారిని సీజ్ చేసి ప్యాక్ చేసి పంపిస్తారు.' అంటూ భారీ సీక్వెన్స్ గురించి ఇంట్రెస్ట్ న్యూస్ రివీల్ చేశారు. 

బడ్జెట్ ఎంతంటే?

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ కోసం బడ్జెట్‌పై కూడా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు జ్యోతికృష్ణ. దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తొలి భాగాన్ని కొంతవరకూ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించగా కొన్ని కారణాలతో ఆయన బాధ్యతల నుంచి విరామం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఎఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. రెండో భాగాన్ని కూడా ఈయనే డైరెక్ట్ చేయనున్నారు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' అనే మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గోపీచంద్‌తో 'ఆక్సిజన్', కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్' మూవీస్ చేశారు. ఆ తర్వాత తమిళంలో 'ఊ ల లా లా', కేడీ చిత్రాలు తెరకెక్కించారు.

Also Read: ఓటీటీలోకి ప్రేమలు హీరో సూపర్ హిట్ మూవీ 'జింఖానా' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

మరోసారి వాయిదా

ఈ నెల 12న 'హరిహర వీరమల్లు' రిలీజ్ కావాల్సి ఉండగా.. మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు శుక్రవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని.. ట్రైలర్‌తో పాటే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.

మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్‌లో నటించారు. అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ తదితరులు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మిస్తున్నారు.