Hari Hara Veera Mallu Reactions Telugu: 'హరి హర వీరమల్లు'కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు సినిమా నచ్చిందని చెబుతున్నారు. సామాన్య ప్రేక్షకులు సినిమా సోసోగా ఉందని, సెకండాఫ్ బాలేదని విమర్శలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
'ఆర్ఆర్ఆర్'లో... 'వీరమల్లు'లో...రెండిటిలో ఉన్న కామన్ సీన్ ఏంటి?'ఆర్ఆర్ఆర్' సినిమా గుర్తు ఉందా? ఒక బ్రిడ్జ్ మీద నుంచి చిన్న పాపను కాపాడటం కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ తాళ్ల సాయంతో కిందకు దూకుతారు. ఇద్దరూ చేతులు కలుపుతారు. సేమ్ టు సేమ్ 'హరి హర వీరమల్లు' సినిమాలోనూ అటువంటి సీన్ ఒకటి ఉంది.
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలా అయితే చేతులు కలిపారో... 'హరి హర వీరమల్లు'లో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ అలాగే చేతులు కలిపారు. కానీ, ఆ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్స్ ఉంది. 'ఆర్ఆర్ఆర్'లో హీరోలు స్నేహితులు అయితే... 'వీరమల్లు'లో ఇద్దరూ శత్రువులు. అయితే ఆ సీన్ మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ వల్ల! ఆ సీన్ కంటే ముందు సినిమా ఎండ్ చేసి ఉంటే బావుండేదని సైతం జనాలు అనుకుంటున్నారు. రెండో పార్ట్ కోసం ఆ ట్విస్ట్ ఇవ్వవలసిన అవసరం లేదని అంటున్నారు.
ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు. ఆయనతో పవన్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయని అభిమానులు ఆశించారు. ఆ విషయంలో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సెకండ్ పార్ట్ కోసం అన్నట్టు ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ దాచి ఉంచారేమో!?
ప్రీమియర్ షోలకు ఫుల్ కలెక్షన్!రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ జూలై 23న 'హరి హర వీరమల్లు' ప్రీమియర్ షోలు భారీ ఎత్తున పడ్డాయి. థియేటర్ల దగ్గర పవన్ అభిమానుల సందడి, కోలాహలం కనిపించింది. దాంతో కలెక్షన్స్ భారీగా రావడం గ్యారెంటీ అని అర్థం అవుతోంది.
