Chikitu Vibe From Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కూలీ’. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈరోజు (డిసెంబర్ 12) రజనీకాంత్ పుట్టినరోజు. దీంతో ‘కూలీ’ టీమ్ ప్రత్యేకంగా చికిటు వైబ్ అనే డ్యాన్స్ బిట్‌ను విడుదల చేసింది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ వేయడాన్ని చూడవచ్చు. ఈ వీడియోను చూసిన తలైవర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ వీడియోను మీరు చూసేయండి.
విడుదల ఆరోజేనా?
2025 మే 1వ తేదీన ‘కూలీ’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైనే తలైవర్ ఫ్యాన్స్‌కు ఆరోజు పండగే అని చెప్పవచ్చు. తెలుగులో అదే రోజు నాని ‘హిట్ 3’ కూడా విడుదల కావాల్సి ఉంది. ‘హిట్ 3’ షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్‌గా జరిగిపోతూ ఉంది. మరి సూపర్ స్టార్ కోసం నేచురల్ స్టార్ వెనక్కి తగ్గుతారా? లేకపోతే అదే రోజు క్లాష్‌లో రిలీజ్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే రజనీకాంత్, లోకేష్ కనగరాజ్‌ల కాంబో తెలుగులో కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశం కూడా ఉంది. దీనికి తోడు ఇందులో కింగ్ నాగార్జున కూడా విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!
పాన్ ఇండియా స్టార్ కాస్ట్...
ఈ సినిమాలో ఇండియాలోని అన్ని పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్లు నటిస్తున్నారు. తెలుగు నుంచి నాగార్జున, మలయాళం నుంచి సౌబిన్ షహీర్, కన్నడం నుంచి ఉపేంద్ర... వీరితో పాటు సత్యరాజ్, శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం జైపూర్‌లో రజనీకాంత్, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్‌లపై సీన్లు షూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ ఆరోగ్య సమస్యల కారణంగా అక్టోబర్‌లో కొన్ని రోజులు షూటింగ్‌కు బ్రేక్ జరుగుతుంది. ఇప్పుడు మళ్లీ చాలా వేగంగా షూట్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో ప్రొడక్షన్...
ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా భారీ ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అన్బరివ్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఎప్పుడూ పని చేసే ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.