Hanuman OTT Partner: భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లోకి వచ్చిన హనుమాన్ మూవీ థియేటర్లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జనవరి 12న) థియేటర్లోకి వచ్చింది. సూపర్ మ్యాన్ జానర్లో వచ్చిన ఈ మూవీకి ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. తెలుగులో సూపర్ మ్యాన్ జానర్లో సినిమా వచ్చి హిట్ కొట్టడం చాలా అరుదు. కానీ హనుమాన్‌తో ఆ లోటు తీర్చాడు ప్రశాంత్ వర్మ.
అంతేకాదు సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి స్టార్ కాంబినేషన్‌కు పొటిగా 'హనుమాన్' రిలీజ్ చేసి భారీ హిట్ కొట్టాడు. ఫైనల్ ఆడియన్స్, సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు హనుమాన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ చర్చనీయాంశంగా మారాయి. భారీ హిట్ కొట్టిన ఈసినిమా డిజిటల్ రైట్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని చర్చించుకుంటున్నారు.
భారీ ధర పలికిన హనుమాన్ ఓటీటీ రైట్స్!
క్రమంలో హనుమాన్ ఓటీటీ రైట్స్ సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. హనుమాన్ ఓటీటీ రైట్స్‌ను జీ5(Zee5) సోంతం చేసుకుందని సమాచారం. 11 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు టాక్. దీనిక కోసం జీ5 సంస్థ నిర్మాతలకు భారీగానే చెల్లిందట. సాధారణం సినిమా రిజల్ట్‌ను బట్టి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు అవుతుంది. అయితే హనుమాన్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం నిరీక్షించక తప్పదనిపిస్తోంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం చూస్తే హనుమాన్ మార్చిలో ఓటీటీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే హనుమాన్‌కు సీక్వెల్ ఉండనుందని ఇప్పటికే మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. మూవీ ప్రారంభంలో 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' అని టైటిల్ కార్డు వేశారు. సినిమా విడుదలకు ముందు ఆ విషయం చెప్పారు. ఈ యూనివర్స్ / ఫ్రాంచైజీలో చాలా మంది సూపర్ హీరోలు ఉంటారని, వరుస సినిమాలు తీస్తానని చెప్పారు. 'హనుమాన్' ఎండింగ్‌లో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అంతేకాదు సీక్వెల్ టైటిల్‌ను కూడా అప్పుడే రివీల్ చేశారు. ఈ మూవీ సీక్వెల్‌కు 'జై హనుమాన్' టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది 2025లో సినిమాను విడుదల చేస్తామని కూడా స్పష్టం చేశారు.
ఈ సినిమాలో ఓ సామాన్య యువకుడు సూపర్ హీరో ఎలా అయ్యాడు? అనేది కథ. 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడు వచ్చి ఏం చేశారనేదే కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరూ జంటగా నటించిన తొలి చిత్రమిది. ఇందులో తేజ సజ్జ సోదరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించగా.. వినయ్ రాయ్ విలన్ రోల్లో అలరించాడు. ఇతర కీలక పాత్రల్లో రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి, రాకేష్ మాస్టర్ కనిపించారు. దర్శక నటుడు సముద్రఖని విభీషణుడి పాత్ర పోషించారు.