Jai Hanuman Begins: రిలీజైనప్పటి నుంచి ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ ట్రెండింగ్‌లో నిలుస్తుంది. రికార్డు వసూళ్లతో సర్‌ప్రైజ్‌చేస్తూ కొత్త అప్‌డేట్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. ఈ మూవీ ఎండింగ్ హనుమాన్‌కు సీక్వెల్ ఉన్నట్టు మూవీ టీం స్పష్టం చేసింది. అంతేకాదు టైటిల్ జై హనుమాన్ అని కూడా అప్పుడే రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ మూవీపై మరింత బజ్ నెలకొంది. అప్పుడే జై హనుమాన్ సంబంధించి అప్‌డేట్స్, పుకార్లు రోజు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు అయోధ్య రామ మందిరం సందర్భంగా ఈ స్పెషల్ డేకు ప్రశాంత్ వర్మ సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంకా హనుమాన్ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగానే సీక్వెల్‌పై క్రేజ్ అప్‌డేట్ ఇచ్చాడు.
జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. నేడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై హనుమాన్ స్క్రిప్ట్ బుక్‌ను ఆయన హనుమాన్ విగ్రహం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుందన్నారు. "హనుమాన్‌పై అపారమైన ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిక కృతజ్ఞుడిని. నా వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాను. చెప్పినట్టుగానే జై హనుమాన్‌ను 2025లో రిలీజ్ చేస్తాం. అయోధ్య రామమందిరం సందర్భంగా జై హనుమాన్ పనులను ప్రారంభించాం.
మూవీని మొదలు పెట్టడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని అనుకుంటున్నా" అని పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఓవర్సీస్ ఆడియన్స్ కి హనుమాన్ మేకర్స్ ఆ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. యూఎస్ లోని ఎంపిక చేసిన థియేటర్లలో సగం ధరకే టికెట్లు ఇస్తామని ప్రకటింటారు మేకర్స్. దీంతో అక్కడ హనుమాన్ మూవీ ప్రదర్శింపబడుతోన్న 11 థియేటర్లలో జనవరి 22 సోమవారం రోజున ఈ టికెట్ ధరలను తగ్గించి ఆడియన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ ఆఫర్ కేవలం ఆఫ్‌లైన్‌లో లభిస్తుందని స్పష్టం చేశారు. కేవలం కౌంటర్ల దగ్గర నేరుగా టికెట్లు కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్, ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించని పేర్కొన్నారు.
Also Read: 'హనుమాన్' సీక్వెల్లో తేజ సజ్జ హీరో కాదు, ఓ స్టార్ హీరో - ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్
మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవం రోజునే ఈ మూవీ నుంచి మరో ప్రకటన కూడా వచ్చింది. హనుమాన్ పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 200 కోట్ల గ్రాస్ చేసినట్టు నేడు మూవీ టీం ప్రకటన ఇచ్చింది. అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన సందర్భంగా హనుమాన్ రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని ప్రశాంత్ వర్మ అండ్ టీం పేర్కొంది. కాగా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన హనుమాన్ ఫస్ట్ షో నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇప్పటికీ అదే జోరుతో హనుమాన్ రికార్డు వసూళ్ల దిశగా వెలుతుంది. ఇక మున్ముందు హనుమాన్ ఇంకేన్ని రికార్ట్స్ కొల్లగొడుతుందో చూడాలి.