Jyothi Rai Tattoo Video: స్టార్‌ మాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్లో గుప్పెడంత మనసు ఒకటి. ఈ మూవీ టీఆర్సీలో రేటింగ్‌లో టాప్‌లో దూసుకుపోయిన ఈ సీరియల్ ప్రస్తుతం వెనకిబడి ఉంది. దీనికి కారణం ఈ సీరియల్లోని ప్రధాన పాత్రలు రిషి సార్‌, జగతి మేడమ్‌ లేకపోవడమే. ఈ సీరియల్లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. అందులో రిషి, వసుధార కెమిస్ట్రీకి సపరేట్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగే ఉంది. ఆ తర్వాత అంతటి ఆదరణ పొందిన పాత్ర జగతి మేడమ్‌. రిషి తల్లిగా ఆమె పండించిన ఎమోషన్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.


సీరియల్లో ఇలా.. బయట అలా


కొడుకు ప్రేమ కోసం, అమ్మాని పిలుపించుకోవడం ఓ తల్లి పడే వేదనను జగతి పాత్రలో జ్యోతిరాయ్‌ చాలా చక్కగా ఒదిగిపోయింది. సీరియల్లో తన చీరకట్టు, బొట్టుతో మహిళా ఆడియన్స్‌ని సైతం ఆకట్టుకుంది. అయితే బుల్లితెరపై అంత వినయం, అభినయం చూపించిన ఆమె బయటకు మాత్రం పొట్టి  పొట్టి బట్టల్లో పుల్‌ గ్లామర్‌ షో చేస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోషూట్‌ షేర్‌ చేస్తూ షాకిస్తుంది. అంతేకాదు పళ్లయిన ఆమె మళ్లీ ప్రేమలో పడిందని, ప్రియుడిని కోసం భర్తకు విడాకులు ఇచ్చిందంటూ ఆ మధ్య జ్యోతిరాయ్‌పై వార్తలు వినిపించాయి.


Also Read: హనుమాన్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ - భారీగా రెమ్యునరేషన్‌ పెంచిన తేజ సజ్జా! ఎంతంటే..


ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్‌ను స్వయంగా పరిచయం చేసి ఆ వార్తలు నిజమని తేల్చేసింది. ఈ క్రమంలో కొందరు జ్యోతిరాయ్‌పై మండిపడ్డారు. పెళ్లయి కొడుకు కూడా ఉన్న ఆమె మళ్లీ ప్రేమలో పడటం ఏంటనీ వెటకరించారు. మరికొందరు మాత్రం ఎవరి వ్యక్తిగత జీవితం వారిందంటూ మద్దుతు ఇచ్చారు. బుల్లితెరపై జగతిగా.. సోషల్‌ మీడియాలో జ్యోతిరాయ్‌గా ఈ బ్యూటీ సెన్సేషన్‌ అయ్యింది. ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతుంది. తాజాగా మరోసారి జ్యోతిరాయ్‌ వార్తల్లోకి వచ్చింది. ఎదపై టాటూ వేయించుకుంటున్న వీడియో షేర్‌ చేసి తన ఫాలోవర్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. 


బాధతో విలవిల్లాడిన జగతి మేడమ్


ఈ వీడియోలో జ్యోతిరాయ్‌ తన హార్ట్ పై బట్టర్ ఫ్లై టాటూ వేయించుకుంది. లాస్ట్ నైట్ ఇలా టాటూ వేయించుకున్నానంటూ వీడియో షేర్‌ చేసింది. ఇందులో చాలా నొప్పితో ఆమె విలవిల్లాడుతూ కనిపించింది. ఈ పోస్ట్‌లోనూ తన బాధను వ్యక్తం చేసింది. టాటూ వేసుకోవాలనే సరదా ఉంటుంది.. కానీ ఇది వేస్తున్నప్పుడు ఉండే నొప్పిని చెప్పలేం.. నన్ను నమ్మండి.. చాలా బాధగా ఉంది" అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. హోప్‌ అంటూ బట్టర్‌ ఫ్లై టాటూ వేసుకున్నట్టు కూడా ఆమె చూపించింది. ఇది తన ప్రియుడు సుకు పూర్వాజ్‌ వేయించాడని కూడా ఆమె చెప్పింది.






ఆమె టాటూ వేయించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జ్యోతిరాయ్‌ కన్నడ డైరెక్టర్‌ను సుకు పూర్వాజ్‌తో ప్రేమలో పడినట్టు ఇటీవలె వెల్లడించింది. కానీ పెళ్లి గురించి మాత్రం చెప్పలేదు. అయితే తన సోషల్‌ మీడిమాలో ప్రోఫైల్లో జ్యోతిరాయ్‌ తన పేరు పక్కన పూర్వాజ్‌ అని ఇంటి పేరు కూడా మార్చేసింది. దాంతో వీరిద్దరికి పెళ్లయిందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇక గుప్పెడంత మనసు సీరియల్‌తో వచ్చిన క్రేజ్‌తో జ్యోతిరాయ్‌ పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో చాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం ఆమె ప్రెట్టీ గర్ల్‌ అనే వెబ్‌ సిరీస్‌తో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తుంది.