తెలుగులో కమర్షియల్ సినిమాలు చేయడానికి పర్ఫెక్ట్ అనిపించే హీరోల్లో మాచో స్టార్ గోపీచంద్ కూడా ఒకరు. యాక్షన్ ప్లస్ ఎమోషన్స్ ఉండే కమర్షియల్ కథలు గోపీచంద్‌‌కు బాగా సూట్ అవుతాయి. ఇప్పటివరకు తను డిఫరెంట్‌గా ట్రై చేసిన కథలకంటే కమర్షియల్ కథలే తనకు ఎక్కువగా సక్సెస్‌ను అందించాయి. ఇప్పుడు మరోసారి తన సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తూ గోపీచంద్ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే ‘భీమా’ అనే టైటిల్ ఖరారయ్యింది. ఇది గోపీచంద్ కెరీర్‌లో హీరోగా తెరకెక్కనున్న 31వ చిత్రం. ఈ మూవీ కోసం కన్నడ డైరెక్టర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారు మేకర్స్. తాజాగా ‘భీమా’ నుంచి కొత్త అప్డేట్ రిలీజ్ అయ్యింది.


‘భీమా’ లుక్‌కు మంచి రెస్పాన్స్..
కన్నడలో ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించి, స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు ఏ హర్ష. శాండిల్‌వుడ్‌లో విపరీతమైన పాపులారిటీ ఉన్న ఈ దర్శకుడు త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. మాస్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే హర్షతో గోపీచంద్ చేతులు కలిపాడు. ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ కెరీర్‌లో 31వ చిత్రంగా తెరకెక్కుతున్రన ఈ సినిమాకు ‘భీమా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. గోపీచంద్ పుట్టినరోజు నాడు ఈ ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. పోలీస్ యూనిఫార్మ్‌లో ఉన్న గోపీచంద్ లుక్ అదిరిపోయింది అంటూ ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఇక తాజాగా ఇందులో యాక్ట్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరో రిలీజ్ చేశారు మేకర్స్.


ఇద్దరు భామలతో..
గోపీచంద్ ‘భీమా’లో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ.. హీరోయిన్స్‌గా నటిస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఇద్దరి హీరోయిన్స్‌కు సినిమాలో సమాన ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రియా భవానీ శంకర్ తాజాగా ‘కళ్యాణం కమనీయం’ అనే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాళవికా శర్మ కూడా రవితేజ, రామ్ లాంటి స్టార్లతో నటించి గుర్తింపును అందుకుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి కమర్షియల్ హీరో గోపీచంద్‌తో స్టెప్పులేయనున్నారు. పైగా ‘భీమా’ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేరని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘భీమా’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అంతే కాకుండా ఈ మూవీ కోసం టాప్ టెక్నిషియన్స్‌లో బరిలోకి దించారు. 


 ‘భీమా’ చిత్రానికి స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టనున్నాడు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్ స్థానాన్ని తీసుకోగా.. కిరణ్ ఎడిటర్‌ బాధ్యతలు స్వీకరించాడు. అజ్జు మహంకాళి ‘భీమా’కు డైలాగులు అందిస్తున్నాడు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫైట్స్‌ను ఏకంగా నలుగురు ఫైట్ మాస్టర్లు కంపోజ్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్‌తో పాటు వెంకట్, డాక్టర్ రవి వర్మ కూడా ‘భీమా’కు ఫైట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు.


Also Read: ఆ ఒత్తిళ్ల వల్లే ‘ఓఎమ్‌జీ 2’ మూవీకి ‘A’ సర్టిఫికెట్ - ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial