Krishna Chaitanya's Ghantasala The Great Movie Teaser Out Now : ఘంటసాల... సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా 'ఘంటసాల ది గ్రేట్' మూవీ తెరకెక్కింది. ఫేమస్ సింగర్ కృష్ణ చైతన్య ఈ సినిమాలో ఘంటసాలగా నటిస్తుండగా... మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, ఘంటసాల చిన్నప్పటి పాత్రలో తులసి ఫేం అతులిత్ నటించారు. ఈ మూవీకి సీహెచ్ రామారావు దర్శకత్వం వహించగా... ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. 

Continues below advertisement

ఈ మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో సీహెచ్ ఫణి నిర్మించారు. చైతన్య రావు, అతులిత్, మృదులతో పాటు సీనియర్ హీరో సుమన్ కీలక పాత్ర పోషించారు. సుబ్బరాయశర్మ, జే.కె. భారవి, సుమన్ శెట్టి, అనంత్, సాయి కిరణ్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్, జయవాణీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక నిర్మాతలతో పాటు 'లిటిల్ హార్ట్స్' ఫేం ఆదిత్య హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అదే నా ఫస్ట్ రెమ్యునరేషన్

Continues below advertisement

తనకు ఇండస్ట్రీలో అశోక్ అనే ఫ్రెండ్ ద్వారా బాలాజీ, రామారావు వద్ద వర్క్ చేసే ఛాన్స్ వచ్చిందని... ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా ఆయనే ఇచ్చారని 'లిటిల్ హార్ట్స్' ఫేం డైరెక్టర్ ఆదిత్య హాసన్ అన్నారు. 'ఘంటసాల ది గ్రేట్' స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. 'ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్.' అని అన్నారు.

అది నా అదృష్టం

'ఘంటసాల ది గ్రేట్' చిత్రంలో ఘంటసాల గారి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని హీరో కృష్ణ చైతన్య అన్నారు. 'ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగిన నేను ఈ రోజు ఆయన బయోపిక్‌లోనే భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన జీవిత ప్రయాణాన్ని ఆడియన్స్ ఈ చిత్రంలో చూస్తారు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇప్పటికే చాలామంది ఈ మూవీని చూసి ఎమోషనల్‌కు గురయ్యారు. డిసెంబర్ 12న వచ్చే మా సినిమాను అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది.' అని చెప్పారు.

ఎన్ని శక్తులు అడ్డుపడినా...

తన శిష్యుడు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ రామారావు తెలిపారు. 'పాట అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఘంటసాల. సింగర్‌గా కంటే ఆయన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలనే ఈ సినిమా తీశాను. ఘంటసాల పాత్ర పోషించమని ఎంతోమందిని అడిగినా స్వరాభిషేకంలో కృష్ణ చైతన్యను చూసిన తర్వాత నిజంగా ఘంటసాలలానే అనిపించారు. డిసెంబర్ 12న మూవీ రాబోతోంది. ఏది ఏమైనా ఎన్ని శక్తులు ఒడ్డినా ఆ రోజున మూవీ రిలీజ్ చేస్తాను.' అని స్పష్టం చేశారు.

Also Read : ది వరల్డ్ ఆఫ్ 'వారణాసి' - సృష్టి ఆవిర్భావం To కలియుగం... రామయ్యను ఎత్తుకున్న వానర సైన్యం... అసలు స్టోరీ ఏంటంటే?

బయోపిక్ తీయాలంటే చాలా ధైర్యం కావాలని... రామారావు ఎంతో ధైర్యంతో ఈ మూవీ తీశారని రామసత్య నారాయణరాజు అన్నారు. 'ఈ మూవీ చూసి ఎమోషనల్ అయ్యా. ఈ తరం వారికి ఘంటసాల గొప్పదనం తెలియకపోవచ్చు. అందరికీ ఘంటసాల గారి గొప్పదనం తెలిసేలా సినిమా తెరకెక్కించారు. చదలవాడ శ్రీనివాసరావు ఈ మూవీని చూసి మెచ్చుకున్నారు. మహానటిలా ఘంటసాల గొప్ప సినిమా అవుతుంది. డిసెంబర్ 12న మూవీ రిలీజ్ అవుతుంది.' అని అన్నారు.

ఘంటసాల బయోపిక్‌ను తీయడం చాలా ఆనందంగా ఉందని శోభారాణి అన్నారు. ఘంటసాల మహోన్నత వ్యక్తి అని ఆయనకు మరిన్ని అవార్డులు దక్కాలని అన్నారు. డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే మూవీని అందరూ ఆదరించాలని అన్నారు.