Gangs of Godavari Day 3 Box Office Collections: మామూలుగా ప్రతీ ఏడాది సమ్మర్‌లో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎందరో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను విడుదల చేయడానికి సంక్రాంతినే ఎంచుకుంటారు. కానీ ఈసారి మాత్రం సమ్మర్ అంతా పెద్దగా సినిమాలు లేకుండా మూవీ లవర్స్ అంతా బోరింగ్‌గా ఫీలయ్యారు. అలాంటి సమయంలోనే ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీనికి పోటీగా మరో రెండు చిత్రాలు విడుదలయినా కూడా ప్రేక్షకులు ఎక్కువగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూడడడానికే ఇష్టపడుతుండడంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నట్టు తెలుస్తోంది.


కలెక్షన్స్ ఎంతంటే?


‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలయ్యి మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అని మూవీ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బయటపెట్టింది. విడుదలయిన మూడు రోజులకే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ప్రకటించింది. మొదటిరోజే రూ.8.2 కోట్ల కలెక్షన్స్‌లో బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ ఇచ్చింది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాకు పోటీగా ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’, కార్తికేయ హీరోగా ‘భజే వాయు వేగం’ సినిమాలు వచ్చినా కూడా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ను చూడడానికే ఎక్కువగా ప్రేక్షకులు ముందుకొచ్చారు.






పాజిటివ్ రివ్యూలు..


గోదావరి జిల్లాల్లో జరిగే కుల రాజకీయాల ఆధారంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ చైతన్య. టైగర్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలావరకు ఈ మూవీలో బోర్ కొట్టినట్టు అనిపించిన ప్రతీసారి విశ్వక్ నటనే సినిమాను ముందుకు తీసుకెళ్లిందని ఫ్యాన్స్.. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక రత్నాకర్ భార్యగా బుజ్జి పాత్రలో నేహా శెట్టి గ్లామర్, రత్నమాల పాత్రలో అంజలి యాక్టింగ్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. యూత్‌ఫుల్ కథలు మాత్రమే కాదు.. కమర్షియల్ చిత్రాలు కూడా విశ్వక్ సేన్‌కు బాగా వర్కవుట్ అవుతాయని ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి నిరూపించింది.


ఫ్యాన్స్‌లో జోష్..


కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా తన సత్తా చాటుతోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇప్పటికే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఓవర్సీస్‌లో 200 వేల డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ మూవీ. ఓవర్సీస్‌లో ఉన్న మూవీ లవర్స్‌లో సైతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ జోష్‌ను నింపిందని ఫ్యాన్స్ అంటున్నారు. నాగవంశీ నిర్మించిన ఈ మూవీ.. చాలాసార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ముందుగా డిసెంబర్‌లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల అవుతుందని విశ్వక్ ప్రకటించాడు. ఆ తర్వాత మార్చిలో సినిమా వస్తుందని అన్నాడు. కానీ ఫైనల్‌గా మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.


Also Read: నటుడి బ్యాగులో బుల్లెట్ల కలకలం - తనిఖీల్లో బయటపడ్డ 40 బుల్లెట్లు