Gama Awards 2025: దుబాయ్‌లో గామా 2025 అవార్డ్స్... ఈవెంట్ డేట్ నుంచి జ్యూరీ కమిటీ వరకు - డీటెయిల్స్ తెలుసుకోండి

Gama Awards 2025 Date: దుబాయ్‌లో 'గామా' అవార్డులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది 5వ ఎడిషన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి, ఆ ప్రోగ్రాం ఎప్పుడు జరుగుతుందో తెలుసా?

Continues below advertisement

గామా (GAMA) అంటే 'గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్). గల్ఫ్ దేశాల్లో రెండో అతి పెద్ద దేశమైన 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్' (UAE)లోని దుబాయ్ సిటీ వేదికగా 'గామా అవార్డ్స్' (GAMA Awards) నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది అవార్డ్స్ ప్రోగ్రాం ఎప్పుడు చేసేది? ఎక్కడ చేసేది? వెల్లడించారు.

Continues below advertisement

దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో గ్రాండ్ రివీల్!
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె సమక్షంలో 'గామా అవార్డ్స్ 2025' ఐదవ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ జరిగింది. దుబాయ్‌లోని అజ్మాన్, మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఆ వేడుకకు సుమారు 500 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు అయ్యారు. అక్కడ ప్రోగ్రాం డేట్ అండ్ వెన్యూ అనౌన్స్ చేశారు. 

జూన్ 7వ తేదీన... అంటే ఐదు నెలల తర్వాత!
ఇప్పటి వరకు గామా అవార్డ్స్ నాలుగుసార్లు జరిగాయి. కరోనా కారణంగా మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ... దుబాయ్ సిటీలో భారీ ఎత్తున తెలుగు ప్రజల సమక్షంలో అవార్డ్స్ ప్రోగ్రాం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 'గామా అవార్డ్స్' (Gama Awards 2025)ను జూన్ 7వ తేదీన దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్‌లో నిర్వహించబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

జ్యూరీ సభ్యులు ఎవరు? అవార్డ్స్ ఎవరు ఇస్తారు?
'గామా అవార్డ్స్' కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ దర్శకులు ఎ కోదండ రామిరెడ్డితో పాటు సంగీత దర్శకులు కోటి, దర్శకులు బి గోపాల్ సహా మరికొందరు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ అవార్డుల వేడుకకు వచ్చే అతిథిలతో పాటు వీరి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వబడతాయి. 'గామా' గురించి రఘు కుంచె మాట్లాడుతూ... ''గామాతో నాకు మంచి అనుబంధం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి కళాకారులు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ గామా. ఐదో ఎడిషన్ వరకు రావడం సంతోషం. ఈ ఏడాది మరింత ఘనంగా జరగబోతోంది'' అని చెప్పారు.

Also Read: పోలీస్ స్టేషనుకు మంచు మనోజ్... తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా - అసలేం జరిగింది?

'గామా అవార్డ్స్' అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు గామా అవార్డ్స్ నాలుగు ఎడిషన్లు ఘనంగా నిర్వహించాం. ఐదో ఎడిషన్ మరింత భారీ ఎత్తున చేయదలిచాం. జూన్ 7, 2025న జరగబోయే 5వ ఎడిషన్‌కు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం'' అని చెప్పారు. ''ఈసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి 'ది గామా ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్' ఇచ్చి సత్కరించనున్నాం. నామినేషన్లతో పాటు పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తాం'' అని గామా సీఈవో సౌరభ్ కేసరి తెలిపారు.

Also Read: డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఈ వారమే, ఎప్పుడో తెలుసా?

Continues below advertisement