విశాఖపట్నం వేదికగా ఈ నెల 28, 29 తేదీల్లో జీ 20 సదస్సు జరగనుంది. వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు విశాఖను అందంగా తీర్చిదిద్దారు. అయితే, సదస్సుకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు తెలుగులో కాకుండా తమిళ భాషలో ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


తమిళ బ్యానర్ల ఏర్పాటుపై నటి రేఖ తీవ్ర విమర్శలు


సినీ నటి రేఖ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “కనీసం ఇది తెలుగు రాష్ట్రమని, దీనికి తెలుగు అని ఒక భాష ఉందనే కూడా గుర్తింపు లేదు. తెలుగు భాషలో అచ్చు వేసి పంపాలన్న గౌరవం లేదు. మా జెనరేషన్ చచ్చినా కూడా ఇంకా మదరాసీలుగా ఉంటామేమో? జీ20 సదస్సుకి వైజాగ్ కి పంపిన తమిళ ఫ్లెక్సీలు ఇవి. అవి తమిళ భాషలో ఉన్నాయని చూసి కూడా అధికారులు వాటినే కట్టమన్నారు. ఇది చిన్న చూపో? నిర్లక్ష్యమో? అవహేళనో? అర్థం కాలేదు. వైజాగ్ బీచ్ రోడ్ పొడవునా అంతా ఇవే ఫ్లెక్స్ లు. మన ఆంధ్ర వాళ్ళ అంతటి రోషం, పౌరుషం, సిగ్గు, శరం లేని జాతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మనల్ని పక్కవాడి కంటే ముందు మనవాడే కొడతాడు ఛా!” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.



ఇంతకీ ఈ రేఖ భోజ్ ఎవరంటే?


రేఖ భోజ్, తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావాలంటూ చాలా కాలంగా పోరాటం చేస్తోంది. టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదని పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు అమ్మాయిలను కాదని, ఉత్తరాదితో పాటు తమిళ, మళయాళీ అమ్మాయిలను దిగుమతి చేసుకుంటున్నారని విమర్శలు చేసింది. మాధవీ లత, శ్రీరెడ్డి మాదిరిగానే ఈమె ఆందోళన కొనసాగించింది.  ఇక రేఖ భోజ్ ‘మాంగల్యం’, ‘స్వాతి చినుకు ‘సంధ్య వేళలో’, ‘రంగీలా’, ‘కలయా తస్మై నమా’ అనే చిత్రాల్లో నటించింది.


విశాఖలో 2 రోజుల పాటు జీ 20 సదస్సు


విశాఖలో ఈ నెల 28, 29   జీ 20 సదస్సు జరగనుంది. వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. దీనిలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. జీ20 దేశాల ప్రతినిధులు చాలా నగరాల్లో ఈ మీటింగ్స్ జరుపుతున్నారు. అందులో భాగంగా విశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సదస్సు జరపనుంది. వైజాగ్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో రెండు రోజుల పాటు ఈ కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు.


100 కోట్లతో వైజాగ్ సుందరీకరణ


 జీ 20 సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.  విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారు చేశారు .  ఎయిర్ పోర్టు నుంచి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను ముస్తాబు చేశారు. ఎటుచూసినా అతిథులకు ,ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. సదస్సు జరిగే  28,29 తేదీలలో వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి .


Read Also: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్