పెళ్లయిన హీరోయిన్స్.. ఇంకొక హీరోతో రొమాన్స్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా విమర్శిస్తుంటారు ప్రేక్షకులు. కానీ హీరోలకు మాత్రం ఆ రూల్స్ ఏమీ వర్తించవు అన్నట్టుగా ఉంటారు. బాలీవుడ్‌లో ప్రేక్షకుల మైండ్‌సెట్ కాస్త భిన్నంగానే ఉంటుంది. స్క్రీన్‌పై కనిపించే హీరో, హీరోయిన్లకు పెళ్లి అయ్యిందా లేదా అన్న విషయం పట్టించుకోకుండా స్క్రీన్‌పై ఉన్న హీరో, హీరోయిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందా లేదా అని మాత్రమే చూసే ప్రేక్షకులే అక్కడ ఎక్కువ. అయితే గతేడాది ఆలియా భట్‌తో పెళ్లయిన తర్వాత రణబీర్.. మొదటిసారి ఆన్‌ స్క్రీన్ వేరే హీరోయిన్‌కు లిప్ లాక్ ఇచ్చాడు. రణబీర్ చేసిన ఈ లిప్ లాక్‌కు ఆలియా రియాక్షన్ ఏంటి అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. దీనిపై ఆలియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.


‘అర్జున్ రెడ్డి’కి మ్యాచ్ అవుతున్న ‘యానిమల్’..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందనా జంటగా నటించిన సినిమా ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’లాంటి ‌బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సందీప్. కానీ ఈ గ్యాప్ అంతా ప్రేక్షకులు ఎదురుచూడడంలో తప్పు లేదని ఇప్పటికే విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. గ్లింప్స్ తర్వాత విడుదలయిన ‘యానిమల్’ టీజర్ చూస్తుంటే ప్రేక్షకుల్లో హైప్ మరింత ఎక్కువ అయిపోయింది. ఇక తాజాగా ఈ మూవీ నుండి మొదటి పాట విడుదలయ్యింది. ఈ పాటలో రష్మిక, రణబీర్ మధ్య రొమాన్స్‌ను ‘అర్జున్ రెడ్డి’కి మ్యాచ్ అయ్యేలా ప్లాన్ చేశాడు సందీప్.


‘అమ్మాయి’ అంటూ సాగే పాట..
‘హువా మే’ అంటూ సాగే ఈ పాటలో రష్మిక, రణబీర్ పెయిర్ చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లిరికల్ వీడియో కాకుండా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ప్రీతమ్ సంగీత దర్శకత్వంలో రాఘవ్ చైతన్య, ప్రీతమ్ ఈ పాటను పాడారు. హిందీలో ‘హువా మే’గా విడుదలయిన ఈ పాట.. తెలుగు ‘అమ్మాయి’గా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అటు తెలుగులో, ఇటు హిందీలో రెండు భాషల్లోనూ పాటకు పాపులారిటీ లభిస్తోంది. ఇదే సమయంలో రణబీర్ భార్య ఆలియా భట్.. పాటపై రియాక్ట్ అయ్యింది. 


లైట్ తీసుకున్న ఆలియా..
రణబీర్ కపూర్, ఆలియా భట్ గతేడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విడుదలయ్యింది. ఆ సినిమాలో భార్యభర్తలుగా ఆలియా, రణబీర్ లిప్ లాక్ ఇవ్వడంతో ప్రేక్షకులు దానిని పెద్దగా హైలెట్ చేయలేదు. అయితే ఇప్పుడు రష్మికతో ‘యానిమల్’లో జరిగిన లిప్‌లాక్‌పై ఆలియా రియాక్షన్ ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా.. ఈ పాట గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్టోరీలో షేర్ చేసింది ఆలియా. ‘లూప్‌లో ప్లే అవుతుంది’ అంటూ తనకు పాట చాలా నచ్చిన విషయాన్ని బయటపెట్టింది. దీంతో రణబీర్ లిప్ లాక్స్‌ను చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఆలియా సినిమాల విషయానికొస్తే.. తను వసన్ బాలా దర్శకత్వంలో ‘జిగ్రా’ అనే చిత్రంలో నటిస్తోంది.


Also Read: ఏడుపును కంట్రోల్ చేసుకోలేను - నా కూతురు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తోడున్నది అతడే: అమీర్ ఖాన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial