మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ 'ఈగల్' రిలీజ్‌కు రెడీ అయింది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'ఈగల్' ఫైనల్ అవుట్ ఫుట్ చేసి రవితేజ ఫుల్ సాటిస్ఫై అయ్యారు. నిన్న రాత్రి సినిమా చూసి రివ్యూ ఇచ్చారు మాస్ రాజా. 


'ఈగల్' ప్రివ్యూ చూసి రవితేజ ఫుల్ హ్యాపీ


సోమవారం రాత్రి రవితేజతో పాటు మూవీ యూనిట్ 'ఈగల్' సినిమాని స్పెషల్ గా షో వేసుకుని చూశారు. ఈగల్ ప్రివ్యూ చూసిన రవితేజ ఎంతో హ్యాపీగా కనిపించారు. ఈగల్ ఔట్‌పుట్ విషయంలో 'ఐయామ్ సూపర్ సాటిస్ఫైడ్' అంటూ డైరెక్టర్ ని హగ్ చేసుకొని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. రవితేజ ఈగల్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన వీడియోని మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో రవితేజ హ్యాపీనెస్ చూసిన ఫ్యాన్స్ ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






సంక్రాంతికి రావాల్సిన 'ఈగల్'..


మొదట 'ఈగల్' సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. చాలాసార్లు రిలీజ్ వాయిదా పడుతుందంటూ పుకార్లు వినిపించినా వాటిపై మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ కచ్చితంగా సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ సంక్రాంతి బరిలో 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు ఉండడంతో థియేటర్స్ ఇష్యూ ఏర్పడింది. ఐదు సినిమాలు రిలీజ్ అయితే సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఫిలిం ఛాంబర్ నిర్మాతలతో కలిసి ఈగల్ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించి ఫిబ్రవరి 9కి సోలో రిలీజ్ డేట్ ఇచ్చారు. అలా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'ఈగల్' ఇప్పుడు ఫిబ్రవరి 9న సోలోగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.


తొమ్మిదేళ్ల తర్వాత మెగా ఫోన్


టాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని నిఖిల్ తో 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కంటెంట్ పరంగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాని డైరెక్ట్ చేయలేదు. మళ్లీ తొమ్మిది ఏళ్ల గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ అందుకొని 'ఈగల్' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే కార్తీక్ ఘట్టమనేని ఇండస్ట్రీలో దర్శకుడిగా బిజీ అయ్యే అవకాశాలున్నాయి.


డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబోట్ల సహనిర్మాత.


Also Read : ఆ విషయంలో రానా సాయం చేశాడు, నేను అంత అర్హురాలిని కాదు - ఉపాసన కొణిదెల